నియమితులయ్యారు. 2017లో టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. పదేళ్లుగా చంద్రశేఖర్ సారథ్యంలో టాటా న్స్ సంస్థ ఆర్థిక ప్రగతికి పాటుపడ్డారు. కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. సంస్థ కార్యకలాపాలపట్ల పరిపూర్ణ అవగాహనతో చంద్రశేఖరన్ సమర్థ వంతంగా పనిచేశారు. అయితే ఆయన నాయకత్వాన్ని కొనసాగించేందుకు బోర్డు సభ్యుల్లో మద్ధతులేదని తెలుసుకున్న తర్వాత రాజీనామా ప్రకటన చేశారు.
చంద్రశేఖర్ రాజీనామాతో స్టాక్ మార్కెట్లు కుదేలు.. టాటా సన్స్ సంస్థలో చంద్రశేఖరన్ రాజీనామా ప్రకటనతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. టాటా గ్రూప్ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీస్ , టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో పతనమయ్యాయి. రాజీనామా ప్రకటన ప్రభావంతో ఇన్వెస్టర్లలో ఆందోళన చోటుచేసుకుంది. దీంతో టాటా పవర్ షేరు ధర 1.26 శాతం పతనమవగా.. టీసీఎస్ స్టాక్ ధర 3.9 శాతం పడిపోయింది. టాటా స్టీల్ షేర్ ధర 1.86 శాతం మేర పడిపోయాయి.
టాటా సన్స్ బోర్డు సమావేశం ఈనెల 18వతేదీన జరుగబోతోంది. గత ఫిబ్రవరిలో జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ పునర్నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చంద్రశేఖరన్ పునర్నియామకానికి టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. టాటా గ్రూపులో కొన్ని కంపెనీలకు నష్టాలు వస్తున్న అంశాన్ని కూడా సమావేశంలో నోయల్ లేవనెత్తినట్లు తెలిసింది. అయితే.. ఏ కొత్త వ్యాపారమైనా లాభాల్లోకి రావాలంటే కొంత కాలం వేచిచూడాల్సి ఉంటుందని చంద్రశేఖరన్ పునర్నియామకానికి మద్దతిస్తున్న బోర్డు సభ్యులు నాడు పేర్కొన్నట్లు సమాచారం.
భారత కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్‌లో ఊహించని కుదుపు మొదలైంది. టాటా సన్స్ MGMకు ముందే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. టాటా ట్రస్ట్స్ గ్రూప్ లో వచ్చిన విభేదాలే ఈ రాజీనామాకు కారణమనే ప్రచారం జోరుగా గుతోంది. చంద్రశేఖర్ కు మూడోసారి కూడా చైర్మన్‌గా పొడిగింపు దక్కుతుందనుకున్న వేళ... రాజీనామా సంచలనంగా మారింది.
ఉపాధికోసం చేరిన సంస్థలోనే ఉన్నత ఉద్యోగం.. భారత వ్యాపార సామ్రాజ్యంలో సరికొత్త శకానికి నాంది పలికిన నాయకుడు... అత్యంత కష్టసమయంలో టాటా గ్రూప్ పగ్గాలు చేపట్టి విజయం వైపు నడిపిన దిగ్గజం... నటరాజన్ చంద్రశేఖరన్. 2017లో సైరస్ మిస్త్రీ నిష్క్రమణ తర్వాత, టాటా గ్రూప్ చరిత్రలోనే మొదటిసారిగా టాటా కుటుంబేతర వ్యక్తిగా 'టాటా సన్స్' చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు చంద్రశేఖరన్. 1987లో టీసీఎస్‌లో ఓ సాధారణ ట్రైనీగా ప్రయాణం ప్రారంభించి, కంపెనీ అత్యున్నత స్థానానికి ఎదిగిన ఆయన కథ ఎందరికో స్ఫూర్తిదాయకం.
టాటా ముఖచిత్రాన్ని ఛేంజ్ చేసిన చంద్రశేఖరన్.. చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్లలో టాటా గ్రూప్ ముఖచిత్రమే మారిపోయింది. దశాబ్దాల కల అయిన ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గూటికి తెచ్చింది చంద్రశేఖరనే. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో టాటా మోటార్స్‌ను ముందంజలో నిలిపాడు. గుజరాత్, అస్సాంలలో భారీ సెమీకండక్టర్ ప్లాంట్లను నెలకొల్పడం, ఐఫోన్ల తయారీలోకి అడుగుపెట్టడం... ఇలా ఒక్కటేమిటి, టాటా డిజిటల్, టాటా న్యూ యాప్‌లతో గ్రూప్‌ను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఐదు రెట్లకు పైగా మార్కెట్ విలువను పెంచి టాటాను సరికొత్త శిఖరాలకు చేర్చారు.
కార్పోరేట్ రంగంలో తీవ్ర గందరగోళం.. అన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకుంటున్న టైంలోనే టాటా సన్స్‌లో విభేదాల చిచ్చు రగిలింది. ఆగస్టు 18న జరగనున్న టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందే చంద్రశేఖరన్ వైదొలగడం కార్పొరేట్ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. టాటా ట్రస్ట్స్ అధినేత నోయెల్ టాటాతో పాటు బోర్డులోని కీలక సభ్యులతో చంద్రశేఖరన్‌కు కొన్ని వ్యాపార నిర్ణయాలపై అభిప్రాయ భేదాలు వచ్చాయని జోరుగా ప్రచారం జరిగింది.
నష్టాల్లో టాటా డిజిటల్.. ముఖ్యంగా ఎయిర్ ఇండియా, టాటా డిజిటల్ వంటి విభాగాలు ఇంకా నష్టాల్లోనే ఉండటం... వాటికి చేస్తున్న భారీ నిధుల కేటాయింపులపై టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు కంపెనీ బైలాస్ ప్రకారం ఉన్న 65 ఏళ్ల వయస్సు పరిమితి నిబంధనల దృష్ట్యా, ఫిబ్రవరి 2027తో ముగిసే ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడిగించడంపై బోర్డులో ఏకాభిప్రాయం కుదరలేదు. బోర్డు సమావేశంలో ఓటింగ్ వరకు వెళ్లకుండా, బాధ్యతల నుంచి తప్పుకోవడమే మేలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చంద్రశేఖరన్ రాజీనామా వార్తలతో ఒక్కసారిగా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా స్వల్పంగా కంపిస్తాయి. TCS, టాటా మోటార్స్ సహా పలు టాటా గ్రూప్ షేర్లు పతనమయ్యాయి. ఒకవైపు సెమీకండక్టర్లు, ఐఫోన్ తయారీ, ఎయిర్ ఇండియా విస్తరణ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఉన్న టైంలో... ఈ కీలక మార్పు గ్రూప్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఉత్కంఠగా మారింది. టాటా సన్స్ తదుపరి చైర్మన్ ఎవరు కాబోతున్నారనేది ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.