© 2026 nimisham.in

చదువుకోవడానికో లేదా ఉద్యోగం చేయడానికో చాలామంది అమెరికా వెళ్లాలనుకుంటారు. కానీ.. అమెరికాలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ఓ భారతీయ వ్యాపారవేత్త యూరప్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా.. విదేశాలకు వెళ్లాలంటే మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం, వ్యాపార అవకాశాలు వంటి కారణాలు ఉంటాయి. కానీ.. నంద్ జావియా విషయంలో మాత్రం కారణం పూర్తిగా భిన్నం. ప్రపంచాన్ని చూడాలనే కోరికతో యూరప్‌కు వెళ్లినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022లో యూరప్‌తో పరిచయం నంద్ జావియాకు యూరప్‌తో మొదటి పరిచయం 2022లో ఏర్పడింది. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలిసారి స్పెయిన్‌కు వెళ్లాడు. అప్పటి వరకు యూరప్‌ను ప్రత్యక్షంగా చూడకపోవడంతో అక్కడి జీవన విధానం, సంస్కృతి, వాతావరణం గురించి తెలియదు. స్పెయిన్ పర్యటన ఆయన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. యూరప్ తనకు ఎంతగానో నచ్చిందని, అక్కడ ఎక్కువ కాలం ఉండాలనే ఆలోచన అప్పుడే మొదలైందని ఆయన చెప్పారు. యూరప్‌తో పూర్తిగా ప్రేమలో పడిపోయాను అని అన్నారు. ఒక దేశానికే ఎందుకు పరిమితం కావాలి? విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం వెళ్లిన తర్వాత చాలామంది అక్కడే స్థిరపడిపోతారు. కానీ నంద్ జావియా మాత్రం అలా ఆలోచించలేదు. ఒక దేశానికి వెళ్లిన తర్వాత.. ప్రపంచంలో ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయని, ప్రతి దేశానికీ ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానం, అనుభవాలు ఉంటాయని ఆయన గుర్తించారు. అవకాశం ఉంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి కొత్త జీవితాన్ని అనుభవించవచ్చని భావించారు. అందుకే.. స్పెయిన్ తర్వాత యూరప్‌లోని మరో దేశమైన చెక్ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు అయితే అమెరికాను వదిలి యూరప్‌కు వెళ్లడం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని నంద్ జావియా చెప్పారు. దాదాపు నాలుగైదేళ్ల క్రితమే ఏదో ఒక సమయంలో యూరప్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆయన
Aug 15 2026 6:24 PM | Updated on Aug 15 2026 6:43 PM
చదువుకోవడానికో లేదా ఉద్యోగం చేయడానికో చాలామంది అమెరికా వెళ్లాలనుకుంటారు. కానీ.. అమెరికాలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ఓ భారతీయ వ్యాపారవేత్త యూరప్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
సాధారణంగా.. విదేశాలకు వెళ్లాలంటే మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం, వ్యాపార అవకాశాలు వంటి కారణాలు ఉంటాయి. కానీ.. నంద్ జావియా విషయంలో మాత్రం కారణం పూర్తిగా భిన్నం. ప్రపంచాన్ని చూడాలనే కోరికతో యూరప్‌కు వెళ్లినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2022లో యూరప్‌తో పరిచయం నంద్ జావియాకు యూరప్‌తో మొదటి పరిచయం 2022లో ఏర్పడింది. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలిసారి స్పెయిన్‌కు వెళ్లాడు. అప్పటి వరకు యూరప్‌ను ప్రత్యక్షంగా చూడకపోవడంతో అక్కడి జీవన విధానం, సంస్కృతి, వాతావరణం గురించి తెలియదు. స్పెయిన్ పర్యటన ఆయన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. యూరప్ తనకు ఎంతగానో నచ్చిందని, అక్కడ ఎక్కువ కాలం ఉండాలనే ఆలోచన అప్పుడే మొదలైందని ఆయన చెప్పారు. యూరప్‌తో పూర్తిగా ప్రేమలో పడిపోయాను అని అన్నారు.
ఒక దేశానికే ఎందుకు పరిమితం కావాలి? విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం వెళ్లిన తర్వాత చాలామంది అక్కడే స్థిరపడిపోతారు. కానీ నంద్ జావియా మాత్రం అలా ఆలోచించలేదు. ఒక దేశానికి వెళ్లిన తర్వాత.. ప్రపంచంలో ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయని, ప్రతి దేశానికీ ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానం, అనుభవాలు ఉంటాయని ఆయన గుర్తించారు.
అవకాశం ఉంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి కొత్త జీవితాన్ని అనుభవించవచ్చని భావించారు. అందుకే.. స్పెయిన్ తర్వాత యూరప్‌లోని మరో దేశమైన చెక్ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు అయితే అమెరికాను వదిలి యూరప్‌కు వెళ్లడం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని నంద్ జావియా చెప్పారు. దాదాపు నాలుగైదేళ్ల క్రితమే ఏదో ఒక సమయంలో యూరప్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆయన కంపెనీ కూడా క్రమంగా ఎదిగింది. కంపెనీ కార్యకలాపాలను యూరప్‌లో ఉంటూనే నిర్వహించగల స్థాయికి వ్యాపారం చేరుకుంది. దీంతో తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి సరైన సమయం వచ్చిందని భావించారు.
డబ్బు కంటే అనుభవాలకే ప్రాధాన్యం నంద్ జావియా చెప్పిన మాటల్లో ఎక్కువగా ఆకట్టుకునే అంశం ఇదే. యూరప్‌కు వెళ్లడానికి డబ్బు ప్రధాన కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.
తన జీవితంలో ప్రధాన లక్ష్యం మిలియనీర్ కావడం కాదని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ అక్కడి ప్రజలను, సంస్కృతులను, జీవన విధానాలను తెలుసుకుని ‘గ్లోబల్ సిటిజన్’గా మారడం తన లక్ష్యమని చెప్పారు. అంటే.. ఒకే చోట ఉండి సంపాదించడం కంటే.. ప్రపంచాన్ని చుట్టి చూడటం, కొత్త అనుభవాలు పొందడం తనకు ఎక్కువ విలువైనదని ఆయన భావిస్తున్నారు.
అమెరికాలో డబ్బు.. యూరప్‌లో జీవితం? అమెరికా, యూరప్‌లను పోల్చుతూ నంద్ జావియా చేసిన వ్యాఖ్య కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మిలియనీర్ కావాలంటే అమెరికా మంచి ప్రదేశం అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. తన జీవిత లక్ష్యం కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదని చెప్పారు. యూరప్‌లో ఉంటే సంపాదించే విషయంలో కొన్ని అవకాశాలను వదులుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అయితే దానికి బదులుగా తనకు కావాల్సిన జీవిత అనుభవాలు లభిస్తాయని పేర్కొన్నాడు.
ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు)
‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు)
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు
'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు)
బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే
నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా
మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..!
మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా