నేరుగా, స్పష్టంగా అనిపించవచ్చు. ఇది ప్రత్యేకంగా డేటింగ్ సంస్కృతి మారుతున్న సమయంలో ఆసక్తికరంగా మారింది. ఈ తరం మగవాళ్లలో కొంతమంది మొదటి అడుగు వేయడంలోనే వెనుకడుగు వేస్తున్నారని Match.com పరిశోధన సూచిస్తోంది. తిరస్కరణ భయం, consent విషయంలో మారిన సామాజిక నియమాలు, సంబంధాల్లో ఏది సరైన ప్రవర్తన అనే విషయంలో పెరిగిన జాగ్రత్త... ఇవన్నీ కలిపి మొదటి అడుగు వేయడాన్ని కష్టతరం చేస్తున్నాయి. అలాంటి సమయంలో ఒక పెద్ద వయసు మహిళ నుంచి వచ్చే స్పష్టమైన ఆసక్తి ఒక చిన్న వయసున్న మగవాడికి భిన్నమైన అనుభూతిని ఇవ్వొచ్చు. అతనికి అక్కడ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం తక్కువగా అనిపించవచ్చు. అతను ఆమెను ఆకట్టుకోవడం కంటే... ఆమె తనను ఎంచుకోవడమే అతనికి ఆకర్షణగా మారవచ్చు. ఇదే హాలీవుడ్‌కు కూడా అద్భుతమైన కథా మెటీరియల్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి మధ్య వయసు తేడా కేవలం ప్రేమకథ కాదు. అది power dynamicను మార్చేస్తుంది. సాధారణ హాలీవుడ్ రొమాన్స్‌లో పెద్దవాడైన పురుషుడు అనుభవం ఉన్న వ్యక్తి. చిన్న వయసున్న మహిళ అతని ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. కానీ ఈ కొత్త సినిమా కథల్లో ఆ లెక్క తలకిందులవుతుంది. నిర్ణయం తీసుకునే వ్యక్తి ఆమె. తన కోరిక గురించి స్పష్టంగా ఉన్నది ఆమె. కెరీర్లో స్థిరంగా ఉన్నది కూడా ఆమె. చిన్న వయసున్న మగవాడు మాత్రం ఆమె ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అందుకే ఈ కథలు కేవలం రొమాన్స్‌గా కాకుండా పవర్, స్వేచ్ఛ, కోరిక, వయసు గురించి సమాజం పెట్టుకున్న నియమాలను ప్రశ్నించే కథలుగా మారుతున్నాయి. జెన్ జీ వాళ్ల అభిప్రాయం ఇదేనా “చిన్న వయసున్న మగవాడు ఎప్పుడూ inexperienced boyగానే ఉండాలా? అతనికి ఒక పెద్ద మహిళతో ఉండటంలో కూడా fantasy, confidence, emotional attraction ఉండకూడదా?”అని కొంతమంది జెన్ జీ కుర్రాళ్లు మాట్లాడినట్లుగా అమెరికన్ మీడియా అంటోంది. అయితే వాళ్లు అన్నారో లేదో కానీ ,హాలీవుడ్ మాత్రం వారి curiosityని గుర్తించి దాన్ని fantasyగా మార్చి డబ్బులు చేసుకుంటోంది అని చెప్పాలి. సైకాలజిస్ట్ లు చెప్పే మరో మానసిక కారణం కూడా ఉంది. చిన్న వయసున్న మగవాళ్లకు పెద్ద వయసు మహిళలో “పరిపక్వత” ఒక ఆకర్షణగా అనిపించవచ్చు. ఆమె తన వయసు మహిళల కంటే ఎక్కువ జీవిత అనుభవం కలిగి ఉండొచ్చు. తన గురించి ఆమెకు ఎక్కువ అవగాహన ఉండొచ్చు. సంబంధంలో తనకు కావాల్సింది ఏంటో చెప్పగలగొచ్చు. అది కొంతమందికి భద్రతగా అనిపిస్తుంది. మరోవైపు పెద్ద వయసు మహిళకు చిన్న వయసున్న మగవాడిలో కనిపించేది వేరే విషయం. అతనిలో ఆమెకు తన జీవితంలో తగ్గిపోయిన ఒక ఉత్సాహం కనిపించవచ్చు. కొత్తదనం. ఆశ్చర్యం. తనను మళ్లీ కోరుకుంటున్నారనే భావన. ఇక్కడే ఈ సంబంధానికి సైకాలజికల్‌గా మరో పొర చేరుతుంది. వయసు పెరిగిన తర్వాత కూడా తాను ఆకర్షణీయమేనని అనుభవించడం ఒక మహిళకు కేవలం రొమాంటిక్ అనుభూతి కాదు. అది తనపై తనకున్న దృష్టినే మార్చగల అనుభవం. అందుకే హాలీవుడ్లో ఈ కథలు ఎక్కువగా “ఆమె అతన్ని పెళ్లి చేసుకుందా?” దగ్గర ముగియడం లేదు. ఆ సంబంధం తర్వాత ఆమె జీవితంలో ఏం మారింది? ఆమె తన గురించి ఏం తెలుసుకుంది? ఆమెకు మళ్లీ వచ్చిన ఆత్మవిశ్వాసం ఏం చేసింది? ఆమె కెరీర్ ఎలా మారింది? ఇవే అసలు ప్రశ్నలుగా మారుతున్నాయి. I Want Your Sexలో Erikaకి Elliot కేవలం ఒక ప్రేమికుడు కాదు. అతను ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాత ఆమె తన కోరికను, తన కళను, తన కెరీర్‌ను మరో కోణంలో చూడటం మొదలుపెడుతుంది. Vladimirలోనూ శారీరక ఆకర్షణ కంటే పెద్ద విషయం బయటపడుతుంది. కోరికను మళ్లీ అనుభవించడం ఆమె సృజనాత్మకతను కదిలిస్తుంది. అంటే ఈ సినిమాల్లో చిన్న వయసున్న మగవాడు హీరోయిన్ కు “లైఫ్ పార్ట్నర్” కంటే “లైఫ్ ట్రిగ్గర్” గా మారుతున్నాడు. ఇది హాలీవుడ్లో మాత్రమే జరుగుతున్న మార్పు కాదు. అమెరికాలో వివాహం కాని, కలిసి జీవిస్తున్న జంటల్లో మహిళ వయసులో పెద్దగా ఉన్న జంటల వాటా 1995లో 14.5 శాతం ఉండగా, 2023లో 22 శాతానికి చేరింది. Match.com అధ్యయనంలో అమెరికన్ మగవాళ్లలో 30 శాతం మంది తమకంటే కనీసం పదేళ్లు పెద్ద మహిళతో డేటింగ్ చేసినట్లు చెప్పారు. Feeldలో పెద్ద వయసు మహిళలతో సంబంధం కోరుకునే వారిలో 18–25 ఏళ్ల వయసున్న మగవాళ్ల వాటా రెండేళ్లలో 65 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. అంటే సినిమా ఈ మార్పును సృష్టించడం లేదు. సినిమా ఇప్పటికే మారుతున్న సమాజాన్ని పట్టుకుని కథగా మార్చుతోంది. అయితే ఇక్కడ మరో విరుద్ధత ఉంది. డేటింగ్లో ఈ సంబంధాలు పెరుగుతున్నా, పెళ్లిళ్ల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి అంతగా మారలేదు. అమెరికాలో మహిళ తన కన్నా కనీసం మూడేళ్లు పెద్దగా ఉన్న మగవాళ్లతో వివాహం చేసుకుంటోంది. అంటే ప్రేమలో ముందుకు వెళ్లటానికి సమాజం కొంత స్వేచ్ఛ ఇస్తోంది. కానీ జీవిత భాగస్వామిని ఎంచుకునే దగ్గరికి వచ్చేసరికి పాత నియమాలు ఇంకా బతికే ఉన్నాయి. అందుకే హాలీవుడ్‌లోని ఈ కథలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇవి వయసు తేడా గురించి సినిమాలు కావు. చిన్న వయసున్న మగవాడి పాత్ర కూడా అక్కడ మారిపోయింది. అతను ఆమెను రక్షించడానికి వచ్చిన హీరో కాదు. ఆమె జీవితంలోకి వచ్చి ఆమెను సంపూర్ణత ఇచ్చే వ్యక్తి కూడా కాదు. కొన్ని సందర్భాల్లో అతను కేవలం ఒక తలుపు. ఆ తలుపు తెరిచిన తర్వాత ఆమె తిరిగి చూసుకునేది తన జీవితాన్నే. — సూర్య ప్రకాష్ జోశ్యుల