© 2026 nimisham.in

మనల్ని నిత్యం వేధించే దోమల గురించి చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దోమలు తమ ఆకలి తీర్చుకోవడానికి మన రక్తాన్ని తాగవని మీకు తెలుసా? అవును.. ఈ ప్రవర్తన వెనుక ఒక నిర్దిష్టమైన జీవశాస్త్ర కారణం ఉంది. అది వాటి మనుగడకు కాదు, వాటి సంతానోత్పత్తికి సంబంధించినది.వాస్తవానికి, ఆడ, మగ దోమలు రెండూ తమకు కావాల్సిన శక్తిని మొక్కల నుంచి వచ్చే తీపి ద్రవాలు, పండ్ల రసాల నుంచి పొందుతాయి. అయితే, కేవలం ఆడ దోమలు మాత్రమే రక్తం కోసం మనుషులు, ఇతర జీవుల వెంటపడతాయి. దీనికి ప్రధాన కారణం గుడ్ల ఉత్పత్తి. ఆడ దోమ తన గుడ్లను అభివృద్ధి చేయడానికి, పరిపక్వం చేయడానికి అవసరమైన ప్రోటీన్లు, పోషకాలు రక్తంలో పుష్కలంగా ఉంటాయి. రక్తం తాగిన తర్వాతే ఆడ దోమ ఒక గుడ్ల బ్యాచ్‌ను ఉత్పత్తి చేసి, వాటిని సాధారణంగా నిలిచిన నీటిలో లేదా నీటి సమీపంలో పెడుతుంది. రక్తం లభించకపోయినా ఆడ దోమ బతకగలదు కానీ, గుడ్లను ఉత్పత్తి చేయడం కష్టమవుతుంది.మరోవైపు, మగ దోమలు మనుషులను గానీ, ఇతర జంతువులను గానీ కుట్టవు. అవి కేవలం మొక్కల రసాలపైనే ఆధారపడి జీవిస్తాయి. గుడ్ల ఉత్పత్తిలో వాటికి ఎలాంటి పాత్ర ఉండదు. ఆడ దోమ మనల్ని కుట్టినప్పుడు, రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు తన లాలాజలంలో ఉండే ఒక ద్రవాన్ని చర్మంలోకి పంపిస్తుంది. ఈ లాలాజలంలోని ప్రోటీన్లకు మన శరీరం ప్రతిస్పందించినప్పుడే మనకు దురద, వాపు, దద్దుర్లు వంటివి వస్తాయి.దోమలు కేవలం మనుషుల రక్తాన్నే తాగవు
.