© 2026 nimisham.in
చాలామంది ఆల్కహాల్ తాగేవారు మసాలా, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తినడానికి ఇష్టపడతారు. ఉడికించిన, హెల్తీ ఫుడ్ తినేందుకు అంతగా ఆసక్తి చూపరు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ రీసెర్చ్ ద్వారా ఆల్కాహాల్ తాగితే స్పైసీగా ఎందుకు తినాలని ఉంటుందో తెలుసుకుందాం. ఈ రీసెర్చ్ ప్రకారం ఆల్కహాల్ తాగినపుడు శరీరంలో FGF21 అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఉప్పగా, స్పైసీగా ఉండే ఆహారం తినాలన్న కోరికను పెంచుతుంది. ఆల్కహాల్ తాగేటపుడు FGF21 అనే హార్మోన్ రిలీజ్ కావడం వల్ల చిప్స్, చికెన్, మంచూరియా వంటి స్పైసీ ఫుడ్ తినాలన్న ఆసక్తి పెరుగుతుంది. ఇది ఆల్కహాల్ తాగినపుడు మాత్రమే కాదు తాగిన తర్వాత రెండు, మూడు వారాల వరకు ఇదే కోరిక ఉంటుంది. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో ప్రోటీన్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ ప్రోటీన్ క్రేవింగ్స్ వల్ల ఆల్కహాల్ తాగినవారు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. వీరికి సాత్విక ఆహారం తినాలన్న ఆలోచన ఉండదు. ఒకవేళ మీరు ఆల్కహాల్ బానిస అయితే మీకు చికెన్, మటన్, చేపలు వంటి మాంసం ఎక్కువగా తినాలన్న కోరిక ఉంటుంది. మీరు ఆల్కహాల్ తాగేవారు అయితే అన్‌హెల్తీ జంక్ ఫుడ్ బదులు ఇంట్లో వండిన కోడిగుడ్లు (ఉడికించినవి), చికెన్ (గ్రిల్, నూనె తక్కువ), చేపలు (డీప్ ఫ్రై కాకుండా) తినడం మంచిది అని రీసెర్చ్ పేర్కొంది. ఇవి మీకు ప్రోటీన్ అందించడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆల్కహాల్ తాగేముందు కోడిగుడ్లు, ఓట్స్, అవకాడో వంటివి తినడం మంచిది. వీటిలో హెల్తీ ఫ్యా్ట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని నెమ్మదింప చేసి ఆల్కహాల్ శోషణ తగ్గిస్తాయి. అలాగే పొట్ట నిండుగా ఉండటం వల్ల ఎక్కువగా తాగలేరు. ఆల్కహాల్ తాగేటపుడు డ్రై రోస్ట్ చేసిన గింజలు (ఉప్పు కలపనివి), పనీర్ టిక్కా, గ్రిల్ చికెన్, కీరదోస, క్యారెట్ ముక్కలు (హమ్మస్‌తో), పాప్ కార్న్, ఉడికించిన
పల్లీలు, శనగలు వంటివి తీసుకోవడం మంచిది.
ఆల్కహాల్ తాగేముందు, తాగేటపుడు, తాగిన తర్వాత వాటర్ తాగడం చాలా మంచిది. వాటర్ ఎంత ఎక్కువగా తాగితే బాడీ అంత హైడ్రేట్‌గా ఉంటుంది. తలనొప్పి వంటి హ్యాంగోవర్ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ఖాళీ కడుపుతో ఆల్కహాల్ అస్సలు తాగకూడదు. దీనివల్ల కాలేయం, కిడ్నీలు, జీర్ణశక్తిపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. అలాగే తాగేటపుడు పైన చెప్పిన హెల్తీ ఫుడ్స్ తింటూ తాగడం మంచిది.