
ఇండియాలో రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు. రూ.40, రూ.50, రూ.60 కి సేల్ చేస్తుంటారు. అదే కేరళ కొబ్బరి అయింతే ఇంకొంచెం ధర ఉంటుంది. అయినా రూ.100 దాటదు. కానీ అమెరికాలో మాత్రం కొబ్బరి బొండం ఒక లగ్జరీ డ్రింక్ అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే అక్కడ ఒక బొండం ధర 10 డాలర్లు. అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారు రూ.950 నుంచి రూ.960. కొబ్బరి చెట్లు పెరగాలంటే వేడి, తేమతో కూడిన వాతావరణం కావాలి. కానీ అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఎప్పుడూ చలిగానే ఉంటుంది. ఫ్లోరిడా, హవాయి వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొబ్బరి చెట్లు పెరుగుతాయి. ఇది దేశీయ అవసరాలకు సరిపోదు. అందుకే అమెరికా 90% కొబ్బరికాయలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అమెరికాకు అవసరమైన కొబ్బరి బొండాలను ఎక్కువగా థాయ్లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, భారత్ నుంచి ఎగుమతి చేస్తారు. ఇవి వేల కిలోమీటర్లు సముద్ర మార్గంలో ప్రయాణిస్తాయి. షిప్పింగ్ ఛార్జీలు, కంటైనర్ ఖర్చులు, ప్యాకింగ్, ముఖ్యంగా బొండాలు పాడవకుండా ఉండేందుకు అవసరమైన 'కోల్డ్ స్టోరేజ్' ఖర్చులు. దీనివల్ల అమెరికాలో కొబ్బరి బొండాల ధర ఎక్కువ. భారత్తో పోలిస్తే అమెరికాలో కార్మికుల కూలీ (లేబర్ కాస్ట్) చాలా ఎక్కువ. ఓడల నుంచి బొండాలను దించడం, ట్రక్కుల్లో ఎక్కించడం, సూపర్ మార్కెట్లలో సర్దడం వరకు ప్రతి దశలోనూ ఎక్కువ జీతాలు చెల్లించాలి. వీటికి ఇంపోర్ట్ డ్యూటీ, షాపుల అద్దె, కరెంట్ బిల్లులు కూడా తోడవడంతో రూ.1000 దాటిపోతుంది. ప్రపంచంలోనే కొబ్బరికాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి. మన దేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి పంట విరివిగా పండుతుంది. దేశీయంగానే ఉత్పత్తి అవుతుండటంతో రవాణా ఖర్చు చాలా తక్కువ. ఎలాంటి ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండవు. అందుకే మనకు తాజాగా ఉండే కొబ్బరి బొండాలు చౌకగా దొరుకుతాయి. అమెరికాలో 10 డాలర్లకు కొబ్బరి