
ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికా దేశమైన కాంగోను ఎబోలా వైరస్ వణికిస్తోంది. ప్రస్తుత వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. 2014-16 మధ్యకాలంలో పశ్చిమాఫ్రికాలో సంభవించిన ఎబోలా వ్యాప్తి సమయంలో 28 వేలకుపైగా కేసుల్లో 11 వేల మందికిపైగా మృతి చెందారు. చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన ఎబోలా వ్యాప్తి ఇది. ‘‘ప్రస్తుత వైరస్ వ్యాప్తి చాలా ముందుగానే మొదలైంది. దానిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని టెడ్రోస్ తెలిపారు. డబ్ల్యూహెచ్వో ఆరోగ్య అత్యవసర హెచ్చరిక, ప్రతిస్పందన కార్యకలాపాల విభాగం డైరెక్టర్ డా.అబ్దిరహ్మాన్ మహమూద్ మాట్లాడుతూ.. ఈ వ్యాప్తి తీవ్రత మరో ఆరు నెలల్లో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది నుంచి 12 నెలల పాటు వ్యాప్తి కొనసాగే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరగాళ్లకు అడ్డాగా.. మలేసియాలో ఘోస్ట్ సిటీ ప్రస్తుతం కాంగోలో కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి.. చరిత్రలోనే అత్యంత వేగవంతమైనది. ఇప్పటివరకు 4,300కుపైగా కేసుల్లో 2,000 మందికిపైగా మరణించారు. దీనిపై ఈ ఏడాది మే నెలలో డబ్ల్యూహెచ్వో ‘ఆరోగ్య అత్యవసర స్థితి’ని ప్రకటించినప్పటికీ.. ఫిబ్రవరిలోనే వ్యాప్తి మొదలైనట్లు తేలిందని ఆరోగ్య అధికారులు తెలిపారు. గతంలో వ్యాప్తి చెందిన వైరస్ల కంటే ఇది భిన్నమైనదని.. ఈ అరుదైన బుండిబుగ్యో వైరస్ నివారణకు ఆమోదం పొందిన టీకాలు, చికిత్సలు లేవని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు