© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Who is krishna Mohan: రామ మందిరం ట్రస్టు తన విరాళాలు, ఖర్చుల పూర్తి వివరాలను తొలిసారిగా వెల్లడించింది. నిర్మాణానికి ఇప్పటివరకు మొత్తం రూ.3264 కోట్లు అందినట్లు ట్రస్ట్ తెలిపింది, ఇందులో రూ. 2,370 కోట్లు ఆలయ నిర్మాణ పనుల కోసం ఖర్చు చేసినట్లు పేర్కొంది. అయితే, నిధుల దుర్వినియోగం కేసు నేపథ్యంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు రాజీనామా చేయగా, వారి స్థానంలో కృష్ణమోహన్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నిన్న నియమితులయ్యారు. ఆయన రామ మందిరం పనులను పర్యవేక్షిస్తారు. కృష్ణమోహన్ ఎవరు? కొత్తగా తాత్కాలిక కార్యదర్శిగా నియమితులైన కృష్ణమోహన్ మాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధికారి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) లో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం 73 ఏళ్ల కృష్ణమోహన్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన హర్దోయ్ జిల్లాలోని చంద్రాపూర్ గ్రామానికి చెందినవారు. అంతేకాకుండా, రామ మందిరం ట్రస్ట్ నిర్వహణలో ఉన్న లోపాలను , నిధుల్లో జరుగుతున్న అక్రమాలను మొదటగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా ఈయనే. ఆయన ఇప్పుడు తాత్కాలిక కార్యదర్శిగా నియమితులవ్వడం విశేషం. పోలీసులు, సిట్ రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో, భారీ ఎత్తున జరుగుతున్న విరాళాల దొంగతనం బయటపడింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ట్రస్ట్ నిర్వహణలో ఉన్న లోపాలను కొందరు స్వార్థపరులు అనుకూలంగా వాడుకున్నారని, భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చూడటమే తన బాధ్యత అని పేర్కొన్నారు. రామ మందిరానికి అందే ప్రతి రూపాయి వివరాలను పారదర్శకంగా తెలియజేస్తూ, ట్రస్ట్ పై ప్రజల నమ్మకాన్ని పెంపొందించడమే తన లక్ష్యమని
చెప్పారు. చంపత్ రాయ్‌తో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన పలువురు ఉన్నత స్థాయి అధికారులు కూడా రాజీనామా చేశారు. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కృష్ణమోహన్‌ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ కేసులో దొంగిలించిన నగదు, ఆభరణాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ దుర్వినియోగం పట్ల మత సంస్థలు, రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
దొంగతనం జరిగిందిలా! రామ మందిర విరాళాల దొంగతనం కేసులో నిందితులు ఒక బృందంగా ఏర్పడి, భౌతిక భద్రతా లోపాలను ఉపయోగించుకుని పకడ్బందీగా వ్యూహరచన చేశారు. ఒక వ్యక్తి నగదు తీసుకుంటున్న సమయంలో, మరొకరు కెమెరాకు అడ్డుగా నిలబడి ఆ చర్యను దాచేవారు. ఈ సిబ్బంది దొంగిలించిన డబ్బును తమ దుస్తులు, బూట్ల వంటి వాటిలో దాచిపెట్టి చిన్న చిన్న విడతలుగా బయటకు తరలించారు. నిఘా ఫుటేజీ ప్రతి 45 రోజులకు ఆటోమేటిక్‌గా ఓవర్ రైడ్ అయ్యేలా చేయడం వల్ల, పాత రికార్డులను పరిశీలించి దొంగతనాన్ని కనిపెట్టడం కష్టమయ్యేది. కంట్రోల్ రూమ్ సిబ్బంది కూడా ఈ కదలికలను సరిగ్గా పర్యవేక్షించలేకపోయారు. అంతేకాకుండా, ఈ సిబ్బందుల్లో చాలామంది బంధువులే. దీంతో పథకం వారి ప్లాన్ అమలైంది. ప్రధాన నిందితుడు తిన్ను యాదవ్ తన బంధువైన యాదవ్‌ను నగదు విభాగానికి నియమించి ఈ కుట్రను అమలు చేశారు.
8 మంది అరెస్టు... ఈ విరాళాల దుర్వినియోగం మరియు కుట్ర కేసులో ప్రధానంగా చంపత్ రాయ్, అవినాష్ శుక్ల, కరుణేష్ పాండే, అనుకులోక్ మిశ్ర, లవకుశ మిశ్ర, తిన్ను యాదవ్, రామ శంకర్ మిశ్రాలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి భారీ నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.