
టాలీవుడ్లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా శోభన్ బాబుకు పేరుంది. ఆంధ్రా అందగాడు, సోగ్గాడు, అందాల నటుడు, నటభూషణ్... ఇలా శోభన్ బాబుకు అభిమానుల నుంచి రకరకాల బిరుదులు ఉన్నాయి . వెండితెరపై నటన, స్టైల్, కూల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కోట్లాది ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేశారు శోభన్ బాబు. కెరీర్ బిగినింగ్ లో ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు. కనీసం ఫ్యాన్ కూడా లేని రోజుల్లో తన కుటుంబంతో కలిసి సింగిల్ రూమ్ లో నివసించారు శోభన్ బాబు. అన్ని కష్టాలు అనుభవించారు కాబట్టే.. ఆయన హీరోగా స్థిరపడిన తరువాత కూడా డబ్బు విలువ తెలిసి ప్రవర్తించేవారు. శోభన్ బాబుతో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. ఆయన కూడా అందరితో కలుపుగోలుగా ఉండరు. తనకు బాగా దగ్గరగా ఉండే హీరోయిన్లతో మాత్రం బాగా మాట్లాడుతారు. అంతే కాదు కొత్తగా వచ్చే హీరోయిన్లను ఆయన ర్యాంగింగ్ కూడా చేస్తుటార. ఈ విషయాన్ని అలనాటి సీనియర్ నటి వై విజయ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. అద్భుతమైన అభినయంతో, విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి వై. విజయ (Y. Vijaya). ఆమె రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆయన శోభన్ బాబు గురించి మాట్లాడిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. అలనాటి ‘సోగ్గాడు’ శోభన్ బాబు (Sobhan Babu) తో తనకు ఉన్న మధుర జ్ఞాపకాలను , ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. వై. విజయ కేవలం 13 సంవత్సరాల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశారు. ‘రామ విజేత ఫిలిమ్స్’ నిర్మాణంలో వచ్చిన “తల్లిదండ్రులు” సినిమాలో అవకాశం దక్కించుకున్న సమయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు సినిమాలో శోభన్ బాబు సరసన నటించే అవకాశం ఆమెకు లభించింది. అయితే, అంత చిన్న వయసులోనే అగ్రహీరో పక్కన నటించాల్సి రావడంతో తాను