
ఇంటర్నెట్‌డెస్క్: జాంబీ డ్రగ్.. ఈ పదం పంజాబ్ (Punjab) రాజకీయాల్లో దుమారం రేపుతోంది. భాజపా రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన పోస్టుపై అధికార పార్టీ ఆమ్ ఆద్మీ విరుచుకుపడుతోంది. పంజాబ్ యువత మాదకద్రవ్యాల వ్యసనం బారినపడటంపై హర్భజన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర యువతను వ్యసనాలు చుట్టుముట్టాయని, వారిని కాపాడాలంటూ ఎక్స్ వేదికగా కోరారు. ‘‘మన పంజాబ్‌పై ఎవరి కన్నో పడింది. ఇంతకాలం రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు వారిని నాశనం చేశాయి’’ అంటూ కదలకుండా వంగిన స్థితిలో నిల్చున్న ఇద్దరు వ్యక్తుల దృశ్యాలను షేర్ చేశారు. దీనిపై పంజాబ్ పోలీసులు వెంటనే స్పందించారు. ఆ దృశ్యాలను రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో చిత్రీకరించారని స్పష్టం చేశారు. వెనక పంజాబీ పాట వినిపిస్తే.. అది ఆ వీడియో పంజాబ్లోనిది అవుతుందా..? ఇలా తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను షేర్ చేసేముందు, పోలీసులకు ట్యాగ్ చేసేముందు సరిచూసుకోవాలని సోషల్ మీడియా ఖాతాదారుల్ని కోరుతున్నాం’’ అని ఫ్యాక్ట్ చెక్ (Fact Check) చేశారు. జైలజీన్ (Xylazine).. పశువులకు ఏమైనా చికిత్స చేసినప్పుడు వాడే ఒక పవర్ఫుల్ మత్తుమందు. మనుషులు ఉపయోగించడానికి అనమతి లేదు. జైలజీన్, ఫెంటనిల్ మిశ్రమాన్ని జాంబీ డ్రగ్‌గా పిలుస్తుంటారు (zombie drug). ఇది తీసుకున్నవారు శారీరకంగా నియంత్రణ కోల్పోతారు. ఎటూ కదల్లేని స్థితిలో ఒక్కోసారి వంగిపోయి కనిపిస్తుంటారు. ఈ జాంబీ డ్రగ్‌కు విరుగుడులు ఏవీ పనిచేయవు. మామూలుగా డ్రగ్ ఓవర్ డోస్ అయినప్పుడు నాలోక్సోన్ ఇస్తుంటారు. కానీ జైలజీన్కు అది పనిచేయదు. కానీ ఫెంటనిల్ ప్రభావాన్ని మాత్రం కాస్త తగ్గిస్తుంది. దాంతో శ్వాస ఆడి ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెప్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా