
నేటికాలంలో ప్రేమ, ఆకర్షణ మధ్య తేడాను తెలుసుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడేవారు.. హద్దులు దాటి ముందుకు వెళ్లేవారు కోకొల్లలు ఉన్నారు. అయితే.. నిజమైన ప్రేమకు, ఆకర్షణకు మధ్య గల తేడా గురించి మాత్రమే కాకుండా.. ప్రేమకు అనుబంధానికి మధ్య తేడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వివరంగా తెలుసుకుంటే.. నిజమైన ప్రేమ, ఆకర్షణ..అనుబంధం.. ఒకరితో కలిసి ఉంటే సంతోషంగా ఉండటం ప్రేమ కావచ్చు, కానీ వారు లేకుండా అశాంతిగా ఉండటం ఎల్లప్పుడూ ప్రేమ కాదని అంటున్నారు. చాలాసార్లు బంధాలలో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకుంటున్నారనే ఫీలింగ్ ఎంత డీప్ గా ఉంటుందంటే.. ప్రేమలో ఉన్నామో లేక ఎదుటి వ్యక్తి పట్ల ఆకర్షితులవుతున్నారో, లేదా లోతుగా అనుబంధంలో ఉన్నారో కూడా తెలియనంతగా ఉంటుంది. ప్రేమ మనసును విశాలం చేస్తుంది, అయితే అనుబంధం నెమ్మదిగా మనసును బంధిస్తుంది. ప్రేమలో స్వేచ్ఛ, అనుబంధంలో సొంతమనే బావన ఉంటుంది.. నిజమైన ప్రేమ వ్యక్తిని తన కోరికలకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించదు. అది ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను, భావాలను , స్వేచ్ఛను గౌరవిస్తుంది. దీనికి విరుద్ధంగా అనుబంధం ఎక్కువగా ఉంటే మాత్రమే ఉంటే ఎదుటి వ్యక్తి ఎల్లప్పుడూ తన కోరికల ప్రకారమే ప్రవర్తించాలనే వాంఛను బలపరుస్తుంది. ఇది స్వార్థం కూడా కావచ్చు. నమ్మకం ఉన్నచోట.. భయం ఉండదు.. సంబంధంలో నిజమైన ప్రేమ ఉంటే, దూరం ఉన్నా లేదా ఎంత బిజీగా ఉన్నా నమ్మకం నిలిచి ఉంటుంది. అయితే, అనుబంధం ఎక్కువగా ఉంటే.. కాలంతో పాటు అవతలి వ్యక్తి తమను విడిచిపెడతారేమోనని పదేపదే ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా చేసే ఫోన్ కాల్స్, అరుదుగా , లేదా ఒంటరిగా సమయం గడపడం వంటివి కూడా ఆందోళనకు కారణం కావచ్చు. అందుకే మనసు స్థిరంగా ఉండాలి. ప్రేమలో సాన్నిహిత్యం ఉంటే.. అనుబంధం కోల్పోతామేమో అనే భావన ఉంటుంది.. ఒకరిని