
— సూర్య ప్రకాష్ జోశ్యుల రేటింగ్: 2.5/5 హై కాన్సెప్ట్ కథలు, సినిమాలు ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే ఉంటాయి. ట్రైలర్, టీజర్ రిలీజ్ అయినప్పుడు... ఆ కాన్సెప్ట్ గురించి మొదటిసారి విన్నప్పుడు... “అసలు సినిమాలో దీన్ని ఎలా చూపించారు?”, ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి కలుగుతుంది. అలాంటి ఓ విచిత్రమైన, ఆసక్తికరమైన స్టోరీ లైన్‌తో వచ్చిన సినిమా One Night Only.ఓ crazy premise చుట్టూ దర్శకుడు Will Gluck ఒక romantic comedyని అల్లాడు. మరి ఈ కాన్సెప్ట్ తెరపై కూడా అంతే క్రేజీగా మారిందా? యూనివర్శిల్ స్టూడియోస్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ బ్రీజీ రొమాంటిక్ కామెడీ ఎలా ఉంది. చూడదగినదేనా, అసలు ఇందులో ఆ హైకాన్సెప్టు ఏమిటి ? కథ ఏంటి? న్యూయార్క్‌లో పెళ్లి కాని జంటల మధ్య శారీరక సంబంధం గత మూడేళ్లుగా చట్టవిరుద్ధం. అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే “One Night Only” అనే ప్రత్యేక రాత్రిలో 12 గంటల పాటు ఆ నిషేధం ఎత్తివేయబడుతుంది. ఈ ప్రపంచ నిర్మాణమే సినిమాకు ప్రధాన హై కాన్సెప్ట్. ఆ రాత్రి కోసం సిటీ మొత్తం ఒక పెద్ద eventలా సిద్ధమవుతుంది.ఓవెన్ (Callum Turner) Upper Manhattanలో పిజ్జా షాప్ నడుపుతుంటాడు. తన గర్ల్‌ఫ్రెండ్ Malika (Maya Hawke) తో ఈ స్పెషల్ నైట్ ని గడపాలని అతను అనుకుంటాడు. కానీ అతని ప్లాన్‌ను Malika మార్చేస్తుంది. ఆమె ఈ ఒక్క రాత్రి తమ relationshipను open చేయాలని అనుకుంటుంది. దాంతో Owen ఊహించని సిట్యువేషన్ లో పడతాడు. ఇదే సమయంలో అతనికి Allie (Monica Barbaro) పరిచయం అవుతుంది. Allieకి singer కావాలనే కల. ప్రస్తుతం మాత్రం ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం విచిత్రమైన jingles పాడుతూ డబ్బు సంపాదిస్తుంది. ఆమెకు కూడా ఈ రాత్రిపై ఓ ఎక్సపెక్టేషన్ ఉంటుంది. కేవలం ఒక క్యాజువల్ ఎనకౌంటర్ కాదు...ఒక నిజమైన కనెక్షన్ దొరకాలని ఆమె