
ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరి నోటా వినపడుతున్న పేరు క్వినోవా. వైట్ రైస్ లో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అదే.. క్వినోవాలో అయితే... ఫైబర్, ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటాయి. మరి, అలాంటి ఈ క్వినోవాని వైట్ రైస్ స్థానంలో నెల రోజులు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపడటం దగ్గర నుంచి.. బరువు తగ్గడం వరకు ఈ 30 రోజుల్లో ఎలాంటి మార్పులు చూస్తారో ఇప్పుడు చూద్దాం.. వైట్ రైస్ తో పోలిస్తే క్వినోవా లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వైట్ రైస్ కి బదులుగా క్వినోవా తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఇది తిన్నప్పుడు రోజంతా పొట్ట నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఆకలి కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఫలితంగా సులభంగా బరువు తగ్గుతారు. క్వినోవాలోని అధిక ఫైబర్ ప్రేగుల కదలికలను సులభతరం చేస్తుంది. రోజూ తగినంత నీరు తాగుతూ క్వినోవా తింటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయితే, ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో తినడం ప్రారంభిస్తే మొదట్లో కాస్త గ్యాస్ లేదా పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు, కాబట్టి నెమ్మదిగా అలవాటు చేసుకోవడం మంచిది. క్వినోవా తిన్నంత మాత్రాన మ్యాజిక్‌లా బరువు తగ్గిపోరు. కానీ, ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగించడం వల్ల రోజువారీ కేలరీల వినియోగం తగ్గుతుంది. ఇది క్రమంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.అలా అని దీనిని కూడా మరీ ఎక్కువగా తినకూడదు. క్వినోవాలోని అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే..దీని వల్ల మనకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌ను అందిస్తుంది. శాకాహారులకు వైట్ రైస్ కంటే ఇది ఒక అద్భుతమైన, పుష్కలమైన ప్రోటీన్ మూలం. 5. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో.. వైట్ రైస్ తిన్న వెంటనే రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కానీ క్వినోవాలో ఉండే