© 2026 nimisham.in

ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ దేవత కోట్లమ్మ అమ్మవారి శ్రావణమాసం సంబర మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు 108 బిందెలతో జలాలను తీసుకొచ్చి కోట్లమ్మ అమ్మవారికి జలాభిషేకం భక్తిశ్రద్ధలతో చేశారు. ఆదివారం అమ్మవారి సంబర మహోత్సవం జరగనుంది. మాజీ సర్పంచి అక్కిన నాగమణి, నీటి సంఘం అధ్యక్షుడు గోలి ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు అవతారం, గోలి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.