© 2026 nimisham.in

భీమడోలు: భీమడోలు గ్రామంలో శుక్రవారం ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర ఘనంగా నిర్వహించారు. మానసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఈ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ పరిశీలకులు కొత్తల్లి ఆశిష్ లాల్, ఉంగుటూరు నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జ్ శరణాల మాలతీ రాణి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. మొదట మానసా స్కూల్ వద్ద ప్రారంభమైన యాత్ర గణపతి సెంటర్ వరకు ఉత్సాహంగా సాగింది. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వీరులకు కూడా నివాళులు అర్పించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.