
తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాయ ఈనాడు డిజిటల్, భీమవరం: హైదరాబాద్‌లో చార్మినార్ కావాలన్నా.. జిల్లాలో కలెక్టరేట్ కావాలన్నా.. సొమ్ములిస్తే చాలు తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొందరు సిబ్బంది రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఆ విషయం వాటికీ తెలియదు. అసలు యజమానులకు తెలియకుండానే మరొకర్ని వారిగా చూపిస్తూ భూములకూ రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురానికి చెందిన పి.సురేష్‌బాబుకు అదే జిల్లా పెదయాచవరంలో 12.52 ఎకరాల భూమి ఉంది. దీనిని సదరు యజమాని ఇటీవల టి.శ్రీనివాసరావుకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈసీ తీయించగా.. అప్పటికే పి.హరీశ్ అనే వ్యక్తి ఆ భూమిని తనదిగా చూపించి మరొకరికి విక్రయించారని, దీనిని ఈ ఏడాది మేలో తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసినట్లు అందులో ఉంది. ఈ రిజిస్ట్రేషన్‌కు ముందుగానే దీనిపై అభ్యంతరాలు ఉన్నాయా అని తాడేపల్లిగూడెం నుంచి మార్కాపురం సబ్ రిజిస్ట్రార్‌కు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వెబ్‌ల్యాండ్‌లో యజమాని పేరు ఒకటి, విక్రయదారునిగా అప్లోడ్ చేసిన పీడీఎఫ్‌లో మరొక పేరు ఉందని, రెండు వేర్వేరుగా ఉన్నాయని అక్కడి సబ్ రిజిస్ట్రార్ సమాచారం ఇచ్చారు. అయినా యజమాని సురేష్‌బాబు వేలిముద్రలు, ఆధార్ కార్డు లేకుండానే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవానికి ఒక ప్రాంతంలో ఉన్న భూములకు మరో ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయిస్తే, అక్కడి నుంచి సంబంధిత భూములున్న ప్రాంతానికి డాక్యుమెంటు ఆమోదానికి పంపుతారు. ఆమోదించే సబ్ రిజిస్ట్రార్ సదరు భూములకు మార్కెట్ ధర ప్రకారం ఫీజు చెల్లించారా? నిషేధిత జాబితాలో ఉందా? భూయజమాని వివరాలు నిర్ధారణ, ఇతర వివరాలు పరిశీలించి ఆమోదం తెలుపుతారు. స్థానికంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్‌కు వివాదాస్పద భూములు, స్థలాలపై కొంత అవగాహన ఉంటుంది ధ్రువపత్రాలు, వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దాంతో అక్రమార్కులు వేరే జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బందికి కొంత ముట్టజెప్పి తమకు నచ్చినట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. తాడేపల్లిగూడెంలో ఓ ఉన్నత కుటుంబానికి చెందిన ఆస్తికి ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా