
బరువు తగ్గాలని ప్రయత్నించేవాళ్లు ముందుగా చూసేది తూకం యంత్రాన్నే. రోజూ బరువు చూసుకుంటూ సంఖ్య తగ్గుతుంటే సంతోషపడతారు. కానీ బరువు తగ్గిందంటే శరీరంలోని కొవ్వు కూడా తగ్గిందని చెప్పలేం. శరీరంలో నీరు, గ్లైకోజెన్, తిన్న ఆహారం వంటి వాటి పరిమాణం మారినా బరువులో తేడా కనిపిస్తుంది. నిజంగా కొవ్వు తగ్గుతుందో? లేదో? తెలుసుకోవాలంటే శరీరంలో కనిపించే కొన్ని మార్పులను గమనించాలి.నడుము సైజు తగ్గుతోందా?కొవ్వు తగ్గుతున్నప్పుడు ముందుగా గమనించగల మార్పుల్లో నడుము చుట్టుకొలత తగ్గడం ఒకటి. గతంలో బిగుతుగా ఉన్న ప్యాంట్లు ఇప్పుడు కాస్త వదులుగా అనిపిస్తే అది మంచి సంకేతమే. ముఖ్యంగా బరువు పెద్దగా తగ్గకపోయినా నడుము కొలత తగ్గుతుంటే శరీర కొవ్వు తగ్గే అవకాశం ఉంది.దుస్తులు వదులవుతున్నాయా?స్కేల్‌పై పెద్దగా మార్పు లేకపోయినా చొక్కాలు, ప్యాంట్లు వదులుగా మారుతున్నాయా? అయితే శరీరంలో మార్పు జరుగుతున్నట్టే. నడుము, పొట్ట, తొడలు, ఛాతీ దగ్గర దుస్తుల ఫిట్ ఎలా మారుతోందో గమనించండి.వ్యాయామంలో బలం పెరుగుతోందా?బరువు తగ్గే సమయంలో కండరాలు తగ్గిపోకుండా చూసుకోవడం ముఖ్యం. వ్యాయామం చేస్తూ గతంలో కంటే ఎక్కువ బరువు ఎత్తగలగడం, అదే బరువుతో ఎక్కువసేపు చేయగలగడం మంచి సూచన. ఒకవైపు నడుము తగ్గుతూ.. మరోవైపు వ్యాయామంలో బలం పెరుగుతుంటే శరీర కొవ్వు తగ్గుతూ కండరాలు నిలబడుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.శరీరాకృతిలో తేడా కనిపిస్తోందా?కొవ్వు తగ్గే కొద్దీ శరీర ఆకృతి క్రమంగా మారుతుంది. చేతులు, భుజాలు, ఛాతీ, పొట్ట, కాళ్ల దగ్గర కండరాలు మరింత స్పష్టంగా కనిపించవచ్చు. ఈ మార్పులు ఒక్కరోజులో కనిపించవు. కొన్ని వారాల వ్యవధిలో ఒకే రకమైన