
శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి నాడు నాగ పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున శివుడితో పాటు నాగదేవతను కూడా పూజిస్తారు. నాగదేవతను భక్తితో పూజిస్తే ఆటంకాలు తొలగిపోయి, కుటుంబంలో శాంతి, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్మకం. ఈ ఏడాది నాగ పంచమి ఆగస్టు 17, సోమవారం నాడు వస్తోంది. సోమవారం శివునికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి, ఈ ఏడాది నాగ పంచమికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే నాగపంచమి నాడు కొన్ని నక్షత్రాలు, గ్రహాల శుభ సంచారం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడనున్నాయి. అవి 5 రాశులవారికి మేలు చేయనున్నాయి. మరి ఆ రాశులేవో తెలుసుకోండి. నాగ పంచమి సందర్భంగా ఏర్పడే గ్రహాల అనుకూలత మేష రాశివారికి ఉత్సాహాన్నిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త ప్రాజెక్టులు లేదా విస్తరణ ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలంతో పాటు, లాభాలు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకోకుండా మంచి అవకాశం లభించవచ్చు. ఉద్యోగులు ప్రమోషన్, జీతం పెంపు వంటి శుభవార్తలు వింటారు. కొందరికి ఊహించని విధంగా ధన లాభం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుంభ రాశివారికి ఈ నాగ పంచమి సమయం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడంతో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా మంచి వార్తలు అందుతాయి. గతంలో ఉన్న అప్పుల భారాన్ని క్రమంగా తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. ఆస్తి లేదా భూమి సంబంధిత కేసులలో చిక్కుకున్న వారికి అనుకూలమైన తీర్పు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ధనుస్సు రాశివారికి ఈ సమయం వృత్తి, ఆదాయం విషయాల్లో ఆశాజనకంగా ఉంటుంది. మీ ప్రయత్నాలకు సరైన గుర్తింపు లభించడంతో పాటు, పనిచేసే చోట పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగం కోసం