
VVS Laxman: భారత క్రికెట్లో సెప్టెంబర్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మాజీ బ్యాటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్‌కు మరింత విస్తృతమైన బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయనను క్రికెట్ డైరెక్టర్‌గా నియమించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు? ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న లక్ష్మణ్.. క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడితే ఆయన పరిధి మరింత విస్తరించే అవకాశం ఉంది. టీమ్ ఇండియా, సెలెక్టర్లు, కోచింగ్ సిబ్బంది, CoE, ఆటగాళ్ల కార్యక్రమాల మధ్య సమన్వయం చేయడం ఆయన ప్రధాన బాధ్యతల్లో ఒకటిగా ఉండవచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్ ఎందుకు కీలకం? బీసీసీఐకి సెప్టెంబర్ కీలక సమయంగా పరిగణిస్తున్నారు. బోర్డులోని కొన్ని కీలక పదవులు, వ్యవస్థల్లో మార్పులపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలానికి సంబంధించిన నిర్ణయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అగార్కర్ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉందనే వార్తలు గతంలో వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయనను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో సెప్టెంబర్‌లో సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్మెంట్కు సంబంధించి తీసుకునే నిర్ణయాలు భారత క్రికెట్ భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. లక్ష్మణ్‌కే ఎందుకు అవకాశం? వీవీఎస్ లక్ష్మణ్ చాలా కాలంగా భారత క్రికెట్ వ్యవస్థలో కీలకంగా ఉన్నారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా యువ క్రికెటర్ల నుంచి సీనియర్ ఆటగాళ్ల వరకు ఫిట్నెస్, అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలతో ఆయన లింకై ఉన్నారు.. 2026 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత గౌతమ్ గంభీర్ కూడా లక్ష్మణ్ కృషిని ప్రశంసించినట్లు సమాచారం. భారత క్రికెట్‌కు CoE కీలకమైన వ్యవస్థగా పేర్కొంటూ, తెర వెనుక