
రాజాం: రాజాం పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పట్టణ అభివృద్ధే ధ్యేయంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఈ సందర్భంగా రాజాం తెదేపా కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలనుంచి వినతులు స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై ప్రజల్లో సంతృప్తి గుర్తించామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. అనంతరం కార్యకర్తే అధినేత కార్యక్రమం నిర్వహించి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ భరోసాగా నిలుస్తుందని అన్నారు. కార్యకర్తల కోసం సంక్షేమ విభాగాన్ని నెలకొల్పడం, సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాద బీమా కల్పించడం, పనిచేసే కార్యకర్తలను గుర్తించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం మంత్రి లోకేశ్ కృషికి నిదర్శనమన్నారు. అనంతరం తెలగావీధిలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు సవివరంగా వివరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు