
సెగడాం: ప్రమాదవశాత్తు బావిలో జారిపడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పనసపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మజ్జిలిపేట గ్రామానికి చెందిన రామకృష్ణ, విష్ణుమూర్తి అన్నదమ్ములు. వారిద్దరూ సంతకమిటి మండలం పనసపేటలోని తమ అమ్మమ్మ ఇంటికి ఇటీవల వెళ్లారు. సోమవారం సాయంత్రం వారిద్దరూ నేలబావిలో మోటార్‌ను రిపేర్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. రామకృష్ణ ఇంజినీరింగ్ చదువుతుండగా.. విష్ణుమూర్తి ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు. ఒక్కసారిగా ఇద్దరు కుమారులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.