
విజయనగరం రూరల్: విజయనగరం రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ నూతన కార్యాలయాన్ని ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడు డి. ప్రసన్నకుమార్ సోమవారం ప్రారంభించారు. నూతన ఛైర్మన్ ఈ.ఆర్. సోమయాజులు (రాంజీ) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నూతన కార్యాలయంలో ప్రస్తుతం సీఏ ప్రాక్టీస్‌లో ఉన్న ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆదాయ పన్ను, జీఎస్టీ, వృత్తిపరంగా ఉపయోగపడే సాంకేతిక శిక్షణపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. కొత్తగా సీఏలుగా వస్తున్నవారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నిరంతర సాధన, చర్చలు, అధ్యయనం ద్వారా సీఏలుగా రాణించగలరని ఆయన వివరించారు. విద్యార్థులు, యువతలో ఈ కోర్సుల పట్ల ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఏఐతో ఛార్టర్డ్ అకౌంటెంట్స్‌కు పని మరింత సులభతరం అయిందని అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.