విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బెస్ట్ స్లోగన్‌ను ఎంపిక చేశారు. బెస్ట్ స్లోగన్ పోటీలలో రెండు ఉత్తమ నినాదాలను ఎంపిక చేసినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో ఇద్దరికి సమాన ఓట్లు వచ్చాయని.. అందుకే ఇద్దరిని విజేతలుగా ప్రకటించామని కలెక్టర్ వెల్లడించారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన బీటెక్ సెకండియర్ విద్యార్థిని చెరుకూరి నాగసాయి లక్ష్మి సూచించిన ‘ఉత్తరాంధ్రకు మణిహారం- స్వర్ణాంధ్రకు శ్రీకారం’ను బెస్ట్ స్లోగన్‌ను ఎంపిక చేశారు. అలాగే విజయనగరం పీఎస్ఆర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఎ.శ్రీకైరవి ‘స్వర్ణాంధ్రకు ధ్రువతార- ఉత్తరాంధ్రకు ప్రగతి తార’ స్లోగన్‌ను ఎంపిక చేశారు.బెస్ట్ స్లోగన్ పోటీల్లో విద్యార్థుల నుంచి అందిన మొత్తం 6,199 నినాదాల్లో ముందుగా మొదటి వంద ఎంపిక చేశారు.. ఆ తర్వాత తొలి 20 నినాదాలు ఎంపిక చేశారు. చివరిగా జిల్లా స్థాయి కమిటీ టాప్-20లో ఉన్నవాటిని పరిశీలించి.. అధికారుల ఓటింగ్ ద్వారా ఇద్దరిని ఎంపిక చేసినట్లు కలెక్టర్ ఎస్ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ఈ ఇద్దరికి చెరో రూ.లక్ష చొప్పున త్వరలో సీఎంఆర్ ఎండీ మావూరి వెంకటరమణ నగదు బహుమతిని అందజేస్తారన్నారు. బెస్ట స్లోగన్ పోటీల్లో బహుమతి గెలుచుకున్న ఇద్దరు విద్యార్థులను ప్రశంసించారు.విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై అందరినీ ఆకట్టుకునే విధంగా బెస్ట్ స్లోగన్‌ను తెలుగులో రూపొందించి పంపాలని కోరారు. బెస్ట్ స్లోగన్‌కు లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విమానాశ్రయం ప్రభావం, ప్రత్యేకత, గొప్పదనాన్ని సంక్షిప్తంగా తెలియజేసేలా ఒక్క స్లోగన్‌కు మాత్రమే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించినా.. ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో ఇద్దరిని విజేతులగా ప్రకటించారు. మొత్తం 6,199మంది పోటీపడగా రెండు బెస్ట్ స్లోగన్లకు రూ.లక్ష