
గరివిడి: గరివిడి మండలం కొండపాలెం (గరివిడి )మేజర్ పంచాయతీ పరిధిలో గత 50 రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నిత్యం తాగునీటి సరఫరా లేక నానా అవస్థలు పడుతున్నామని ఆగ్రహిస్తూ, మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట వైకాపా నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైకాపా నాయకులు బొంపల్లి వెంకటరావు, శివుకు కాంతారావుల ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని, కార్యాలయం ఎదుట బైటాయించారు. దాదాపు రెండు నెలలుగా మంచినీటి సమస్యతో అల్లాడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని నినాదాలు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.