ప్రజల్లో ఆరోగ్యం మీద అవగాహన కల్పించేందుకు చాలా మంది ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వైజాగ్ రన్నర్స్ సొసైటీ కూడా మారథన్ నిర్వహించేందుకు తలపెట్టింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు మారథాన్ నిర్వహించిన సొసైటీ ఇప్పుడు ఐదో ఎడిషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. సంధ్యా మెరైన్ వైజాగ్ మారథాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రిజిస్ట్రేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నవంబర్ 29వ తేదీన మారథాన్ జరుగుతుందని వైజాగ్ రన్నర్స్ సొసైటీ పేర్కొంది. మొత్తం నాలుగు విభాగాల్లో ఈ మారథాన్ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. 32, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ మారథాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం కొందరికే కాకుండా ఈ మారథాన్ అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని నిర్ణయించారు. మురికివాడల్లో ప్రజలు కూడా మారథాన్‌లో పాల్గొనేలా విస్తృత ప్రచారం చేయాలని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇలా చేస్తేనే మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తారని చెప్పారు.READ ALSO గుంటూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. రూ. 3 కోట్లతో ప్లాన్, ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి పండగే!ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నదే తమ ఉద్దేశమని మారథాన్ నిర్వాహకులు చెప్పారు. అప్పుడప్పుడు ఇలాంటి మారథాన్లు ఏర్పాటు చేస్తే ప్రాక్టీస్ కోసమైనా వ్యాయామం చేస్తారని, అది అలవాటుగా మారిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కనీసం రోజులో ఒక గంటపాటు అయినా శరీరానికి వ్యాయామం అవసరమని చెబుతున్నారు. పోటీలు నిర్వహించి ప్రైజ్‌మని ప్రకటిస్తే వీటిపై అవగాహన పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.ఈ మారథాన్‌లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్‌మనీ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు రూ. 12 లక్షల నగదు బహుమతులు అందించినున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంధ్యా మెరైన్స్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కొర్రగుంట, అపోలో హాస్పిటల్స్ ఆరిలోవ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణప్రసాద్, ఫైజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సైట్ హెడ్ రవిచందర్ కట్టా, శ్రీకన్యా