© 2026 nimisham.in

వివో టీ5 5G 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది ఈ స్మార్ట్‌ఫోన్ కోసం స్పెషల్ ల్యాండింగ్ పేజీ డిస్ప్లే TUV రైన్‌ల్యాండ్ వెరిఫికేషన్ Vivo T5 5G Launch : వివో ఫ్యాన్స్ గెట్ రెడీ.. అతి త్వరలో వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వస్తోంది.. భారత మార్కెట్లో వివో టీ5 5జీ ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఈ వివో 5జీ ఫోన్ 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ సిరీస్‌లో వివో టీ5 లైట్ 5జీ, వివో టీ5ఎక్స్ 5జీ, వివో టీ5 ప్రో 5జీ ఫోన్లు ఉండనున్నాయి. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పటికే, ఫ్లిప్‌కార్ట్‌లో వివో టీ5 5జీ కోసం స్పెషల్ ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో జెన్ఏఐ-రెడీ NPU ఉంటుంది. ఏఐ పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది. రూ. 35వేల నుంచి రూ. 50వేల లోపు : ఈ స్మార్ట్‌ఫోన్ వివో ఆరిజిన్ఓఎస్పై రన్ అవుతుంది. అలాగే, రూ. 34,999 నుంచి రూ. 49,999 ధరలో వివో T5 5జీ (Vivo T5 5G Launch) అత్యంత సన్నని 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. వివో T5 ప్రో 5జి 'అల్ట్రా-స్లిమ్' 7.99mm ఫ్రేమ్ అమర్చారు. ఈ వివో T5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.74-అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. డిస్ప్లే టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ అందిస్తుంది. ప్రాసెసర్‌గా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 అందిస్తుంది. Read Also : Samsung Galaxy S25 Ultra : దిమ్మతిరిగే ఆఫర్.. శాంసంగ్ అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో రూ. 30వేలు డిస్కౌంట్! ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6.0పై రన్ అవుతుంది. ఇందులో ఏఐ క్రియేషన్, ఏఐ
క్యాప్షన్ వంటి ఏఐ-సంబంధిత ఫీచర్లు ఉన్నాయి. వివో T5 లైట్ 5G బ్యాక్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా, 0.8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా పరిశీలిస్తే.. : Wi-Fi, OTG, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. 6,500mAh బ్యాటరీ, 44W ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ బ్యాటరీ లాంగ్ బ్యాకప్ అందిస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. వివో Y31టీ 5జీ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వివో ఒరిజిన్OS6పై రన్ అవుతుంది. వివో వై31టీ 5జీలో 120Hz రిఫ్రెష్ రేట్, 1,250 నిట్స్ టాప్ బ్రైట్సెస్ 6.75-అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 7,200mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది.