
నటీనటులు : విశాల్, దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, జయప్రకాష్ తదితరులు. దర్శకత్వం : విశాల్ సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్ నిర్మాతలు : ఆర్.బి చౌదరి సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం. నాథన్ ఎడిటింగ్ : ఎన్.బి. శ్రీకాంత్ విశాల్, దుషారా విజయన్, అంజలి కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ మకుటం. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కృప (విశాల్) జమున (దుషారా విజయన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తన ఇద్దరి పిల్లలతో లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. మరోవైపు మెడికల్ రిప్రజెంట్ ఉద్యోగిగా కష్టాలు పడుతూ ఉంటాడు. చాలీ చాలని జీతంతో జీవితాన్ని వెళ్ళదీస్తూ.. తన మామగారితో చెప్పిన అబద్ధం కారణంగా.. కృప, ఓ బీఎండబ్ల్యూ కారు కొంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కృప తన ఫ్యామిలీతో కలిసి తాను కొన్న కారులో ఊటీ వెళతాడు. అక్కడ ఎటాక్ జరుగుతుంది. ఆ సమయంలో అతని భార్య, అతని కూతురు చనిపోతారు. అసలు నెలకు పాతిక వేలు జీతం వచ్చే సామాన్య ఉద్యోగిపై ఎటాక్ ఎందుకు జరిగింది ?, అలా జరగడానికి కారణం ఏమిటి ?, ఈ మధ్యలో లింగా (విశాల్), అన్నపూర్ణ (అంజలి) ఎవరు ?, వారికి – కృపకి ఉన్న కనెక్షన్ ఏమిటి ?, చివరకు ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది సినిమా. ఎప్పటిలాగే విశాల్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విశాల్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషల్ సీన్స్ లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. మొత్తానికి తన పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో విశాల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. దుషారా విజయన్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో