
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vishal Makutam: ఇప్పటికే ‘మకుటం’ నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్లో యాక్షన్, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలను కలిపి చూపించారు. ట్రైలర్ మొదట్లోనే విశాల్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించారు. ఆ తర్వాత కథ కుటుంబ భావోద్వేగాల వైపు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా విశాల్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. ప్రతి పాత్రలో ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్ సన్నివేశాలు ఉండగా, యువతను మెప్పించేలా లవ్ ట్రాక్ కూడా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. అదే సమయంలో కుటుంబ ప్రేక్షకులకు నచ్చే ఎమోషనల్ సన్నివేశాలకు కూడా సినిమాలో మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ట్రైలర్లో విశాల్ చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లింగా, కృపాకర్ పాత్రల్లో ఆయన చెప్పే డైలాగ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో వచ్చే సన్నివేశం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేలా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా ట్రైలర్లో ప్రత్యేకంగా కనిపించింది. రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం కెమెరా పనితనం యాక్షన్ సన్నివేశాలను మరింత గ్రాండ్‌గా చూపిస్తోంది. దిలీప్ సుబ్బరాయన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా