
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, చంద్రులు ఒకే రాశిలో కలిస్తే దాన్ని 'విష యోగం' అంటారు. ఇది చాలా సవాళ్లను తెచ్చిపెడుతుంది. సెప్టెంబర్ 25న, శని సంచరిస్తున్న మీన రాశిలోకి చంద్రుడు ప్రవేశించనున్నాడు. దీంతో ఈ విష యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం 5 రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ రాశులేవో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తే, వాటిని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. పాత పెట్టుబడుల వల్ల వచ్చిన నష్టాలు మళ్లీ ఆర్థిక భారాన్ని పెంచవచ్చు. ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా పెద్ద పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిదికాదు. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగే పరిస్థితులు కూడా రావచ్చు. జ్యోతిష్యుల అంచనాల ప్రకారం, మేష రాశి వారి 12వ ఇంట్లో ఈ విష యోగం ఏర్పడుతుంది. దీనివల్ల అనుకోని ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. విలాస వస్తువుల కోసం, అనవసర విషయాల కోసం ఖర్చు చేయడం వల్ల మీ పొదుపు దెబ్బతింటుంది. వృత్తిపరంగా కూడా పోటీ పెరగవచ్చు. పెద్ద పెట్టుబడుల్లో ఆశించిన లాభాలు రాకపోవచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో నిదానంగా ఉండాలి. ఎగుమతి, దిగుమతి, వ్యవసాయం, టెక్నాలజీ, టెక్స్టైల్ రంగాల్లో ఉన్నవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. శని ఇప్పటికే మీన రాశిలో ఉండగా, చంద్రుడు కూడా అదే రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి మీన రాశి వారిపై ఈ కలయిక ప్రభావం నేరుగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఊహించని ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులపై వెంటనే లాభాలు ఆశిస్తే నిరాశ తప్పదు. ఆదాయం కంటే ఖర్చులు పెరగవచ్చు. అప్పులు చేయడం లేదా ఇతరులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం