
ఐరోపా దేశాల్లో కొలువుల పేరిట భారీగా వసూళ్లు ఫ్లయింగ్ బోర్డర్స్ నిర్వాహకురాలి మాయలెన్నో ఈనాడు-విశాఖపట్నం: ఐరోపా దేశాల్లో ఆకర్షణీయ కొలువుల పేరిట విశాఖ, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత నుంచి భారీగా వసూలు చేసిన ఫ్లయింగ్ బోర్డర్స్ నిర్వాహకురాలిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కన్సల్టెన్సీని నమ్మి మోసపోయిన బాధితులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వందల మంది ఉన్నారు. ఇందులో 15 మందిపైగా బాధితులు రూ.70 లక్షల మేర కోల్పోయామంటూ విశాఖ నగరంలోని గురుద్వారా పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విశాఖ పోలీసులు సెర్చ్ వారెంట్‌తో గురువారం కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని నిర్వాహకురాలు సౌజన్య ఇంటికి వెళ్లారు. పోలీసులు రావడం గమనించిన ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ఎంత ప్రయత్నించినా తెరవలేదు. అతికష్టంపై లోపలికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇంట్లో ఉన్న బంగారం, వెండి, కొన్ని ఆస్తుల పత్రాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా నుంచి ఆమెను విశాఖకు తీసుకు వస్తున్నారు. ఫ్లయింగ్ బోర్డర్స్ పేరుతో సౌజన్య, శ్రీనివాస్ దంపతులు ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. విదేశీయుల పేరుతో ఫేక్ ఈ-మెయిల్స్ పంపి, కొన్ని నకిలీ ఇంటర్వ్యూలు చేయించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి నిరుద్యోగులకు వల వేశారు. ‘తమకు ఉద్యోగాలు వచ్చాయంటూ’ సోషల్ మీడియాలో తన గ్యాంగ్‌తోనే కామెంట్లు పెట్టించారు. అది నిజమని నమ్మిన వందలాది మంది నిరుద్యోగులు ఐరోపా దేశాల్లో ఉద్యోగాలు అనగానే రూ.లక్షల్లో తెచ్చి చెల్లించారు. 750 మందిపైగా నిరుద్యోగుల నుంచి రూ.11.46 కోట్లు వసూలు చేసినట్లు కృష్ణాజిల్లా పరిధిలో పలుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సౌజన్య, శ్రీనివాసరావు దంపతులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా విశాఖలో తెరపైకి వచ్చిన బాధితుల ఫిర్యాదుతో బెయిల్‌పై ఉన్న ఆమెను మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి