
రౌడీషీటర్ల బరితెగింపు నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే బలిఘట్టంలోని క్రికెట్ గ్రౌండ్లో వారం రోజుల కిందట యువకుల మధ్య ఘర్షణ బీరు బాటిళ్లతో దాడులకు దారితీసింది. ఈ ఘటనలో కొంతమంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల దృష్టికి రాగానే దర్యాప్తు జరిపి ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు రౌడీషీటర్లు ఉండటంతో వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. దాడిలో గాయపడిన వారు ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసు ఉండగానే అక్కడకు వచ్చిన కొందరు రెచ్చిపోవడం కలకలం రేపింది. రౌడీషీటర్ బైకుపై వెళ్తుంటే వెనుక వచ్చేవారు గట్టిగా హారన్ కొట్టకూడదట. ఎవరైనా హారన్ మోగిస్తే బండి ఆపి చితక్కొట్టేస్తున్నారు. తనపై దాడి చేస్తున్నది రౌడీ అని తెలియని వారు ఎదురు తిరిగితే దాడి మరింత తీవ్రంగా ఉంటోంది. నర్సీపట్నం పరిధిలో 55 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో కొందరు తరచూ గొడవల్లో తలదూరుస్తున్నారు. కౌన్సిలింగ్, అరెస్టుల వరకే పోలీసుల పరిమితమవుతున్నారు. పదేపదే గొడవలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించడం, అవసరమైతే పట్టణ బహిష్కరణ వంటి కఠిన చర్యలకు వెనుకాడుతున్నారు. ఏడుగురు జైళ్లలోనే..: నర్సీపట్నం పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం టౌన్, నర్సీపట్నం గ్రామీణం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం, కృష్ణదేవిపేట, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల పరిధిలో 130 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో ఏడుగురు వివిధ కేసుల్లో చిక్కుకుని జైళ్లలో ఉన్నారు. అత్యధికంగా నర్సీపట్నంలోనే రౌడీలు ఉన్నారు. రౌడీలను ఉపేక్షించేది లేదు. నేరాలకు పాల్పడితే అరెస్టు చేసి జైలుకు పంపుతున్నాం. ప్రతి వారం స్టేషన్లలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. కొంతమందిని మండల మేజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేశాం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి