
సాగర్‌నగర్: రుషికొండ బీచ్‌లో ఆదివారం సముద్రంలో ఈత కొడుతున్న క్రమంలో అకస్మాతుగా మునిగిపోతున్న ఓ యువకుడిని పోలీసు హెడ్‌కానిస్టేబుల్, శాప్ వాటర్‌స్పోర్ట్స్ కోచ్ వాసుపల్లి దాసు, సిబ్బంది ఎం. రాజు, బి. దుర్గ రక్షించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువకులు మహేశ్ కుమార్ సాహు, సంతోష్ విహారయాత్రలో భాగంగా రుషికొండ బీచ్‌కు వచ్చారు. ఈతకొడుతుండగా మహేశ్ కుమార్ సాహు ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని స్థానిక తీరంలో జలక్రీడల్లో శిక్షణ ఇస్తున్న సిబ్బంది గుర్తించారు. దీంతో ధైర్యసాహసాలతో హూటాహుటిన బోట్ల సాయంతో వెళ్లి యువకుడిని సకాలంలో ఒడ్డుకు సురక్షితంగా చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.