
ఆనందపురం: విశాఖ జిల్లా గంభీరం ఐఐఎం రోడ్డులోని హరే కృష్ణ వైకుంఠంలో కొలువుదీరిన శ్రీ రాధా మదన మోహన స్వామి మందిరంలో సెప్టెంబరు 4, 5 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు అదోక్షజ దాస, శ్యామ మాధవ దాస, సర్వజిత్ రామదాస తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. శ్యామ మాధవ దాస మాట్లాడుతూ.. సెప్టెంబర్ 4న ఉదయం సప్తనదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు, పండ్ల రసాలు, పుష్పాలతో ప్రాతః అభిషేకం చేయనున్నట్లు తెలిపారు. రాత్రి 9.30 గంటలకు మహాభిషేకం ప్రారంభించి, అర్ధరాత్రి 12 గంటలకు మహా మంగళహారతి నిర్వహిస్తామని చెప్పారు.
భక్తుల కోసం 108 పలకలతో హరినామ జప మండపం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాలగోపాలుడికి ఊయల సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టి మహోత్సవం, ‘కృష్ణతో సెల్ఫీ’ పోటీలు నిర్వహిస్తామన్నారు. 5వ తేదీన ఉదయం 11 గంటలకు భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల విగ్రహాలకు అభిషేకం నిర్వహించి, అనంతరం నందోత్సవం సందర్భంగా భక్తులకు విందు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సాయంత్రం 6 గంటలకు భజన కచేరీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.