
బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లా మనోపూర్ ముషహరి గ్రామానికి చెందిన రాహుల్ అనే 12 ఏళ్ల బాలుడు ఎనిమిదేళ్ల క్రితం పాముకాటుకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదట అతడిని ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో తర్వాత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాహుల్ చనిపోయాడని వైద్యుడు చెప్పడంతో కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని గంగానదిలో నిమజ్జనం చేశారు. ఇటీవల ఒక యువ సన్యాసి చేతిలో సారంగి పట్టుకుని గ్రామానికి వచ్చాడు. తానే ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడని భావించిన రాహుల్నని చెప్పడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అతడు నేరుగా తన తల్లిని గుర్తించడమే కాకుండా తండ్రి, అన్న, బాబాయి, అత్త పేర్లను కూడా చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్నప్పుడే శరీరంపై ఏర్పడిన గాయం గుర్తును కూడా గ్రామస్థులు గుర్తించి, ఇతడే రాహుల్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ యువకుడు చెప్పిన కథ మరింత ఆసక్తికరంగా ఉంది. గంగలో తనను వదిలేసినప్పుడు తాను పూర్తిగా చనిపోలేదని, ఇంకా శ్వాస తీసుకుంటున్నానని తెలిపాడు. నదిలో కొట్టుకుపోతూ మొకామా ఘాట్‌కు చేరుకున్నానని, అక్కడ ఉన్న ఓ సాధువు తనను రక్షించి గోరఖ్‌పూర్‌కు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడే ఆధ్యాత్మిక విద్య నేర్పించి, ఎన్నేళ్ల పాటు సన్యాస జీవితం గడిపించిన తర్వాత తన గురువు "నీ తల్లి దగ్గరకు వెళ్లి భిక్ష అడుగు" అని పంపించాడని వివరించాడు. రాహుల్ గ్రామంలో కొద్దిసేపు గడిపిన తర్వాత తిరిగి గోరఖ్‌పూర్ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతడికి మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఫోన్ చేసి, తన గురువుకు చికిత్స, పెంపకం కోసం ఖర్చైన డబ్బుగా రూ.2 లక్షలు ఇవ్వాలని, అప్పుడే శాశ్వతంగా ఇంటికి వస్తానని చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పేద కూలీ కుటుంబం కావడంతో అంత పెద్ద మొత్తాన్ని వెంటనే సమకూర్చలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హేతువాద సంఘాలు అనుమానాలు