ఎపిక్ (Epic)

Vijay Deverakonda : దేవరకొండ బ్రదర్స్, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఇద్దరూ ఒకే స్టేజిపైకి వస్తే ఒకరి గురించి ఒకరు వారి అనుబంధాన్ని, చిన్నప్పటి సంగతులను పంచుకుంటారు. ఆనంద్ హీరోగా నటించిన ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు.

ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు పుట్టపర్తికి వెళ్లి హాస్టల్ లో చదువుకునేటప్పుడు అన్నతో నేను వెళ్తా అని ఏడ్చేవాడు. నేను ఫస్ట్ క్లాస్ నుంచే హాస్టల్ లో ఉన్నా. నేను ఇంటి నుంచి వెళ్లిపోయే ప్రతిసారి ఏడుస్తుంటే మా అమ్మ ఆపేది. నేను మూడవ తరగతిలో హాస్టల్ కి వెళ్ళినపుడు ఆనంద్ ని కూడా నాతో పాటు పంపారు. అప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ అయినా మా క్లాస్ లో నా కోసం వచ్చి కూర్చునేవాడు. ఒక వారం రోజులు మా క్లాస్ లోనే కూర్చున్నాడు. వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి తీసుకెళ్తుంటే బాగా ఏడ్చాడు. వాడు మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఏడవకపోయినా ఇంటికి వచ్చి నేను ఏడ్చాను. ఇంట్లో వాడితో గేమ్స్, క్రికెట్ ఆడిన జ్ఞాపకాలు గుర్తుచేసుకొని మూడు రోజులు ఏడ్చాను. ఇప్పుడు వాడ్ని హీరోగా ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తుంటే చూసి గర్వపడుతున్నాను అని అన్నాడు.

Also See : Epic Pre Relrease Event : ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ హంగామా.. ఫొటోలు..

అలాగే ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో తరతరాలుగా వస్తున్న వాళ్ళ ఫ్యామిలీ బాధలను, మిడిల్ క్లాస్ బాధలని ని బ్రేక్ చేయడానికి ఒకడు వస్తాడు. అది మా ఇంట్లో మా అన్నే. ఇప్పుడు మేము ఇలా ఉన్నాము అంటే మా అన్నే కారణం అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

<iframe title="Vijay Deverakonda Speech at EPIC - First Semester Trailer Launch Event | Anand | Vaishnavi" width="500" height="281" src="https://www.youtube.com/embed/85tMKbNQOE8?