© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Vietnam Boat Accident Indian names list: విహారయాత్రల కోసం వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయులు, అక్కడ జరిగిన బోటు ప్రమాదంలో నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మరణించిన 15 మందిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల, ద్వీపం సమీపంలోని హోమ్ మే రూట్ వద్ద ఫుట్ వాక్ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు స్పీడ్ బోట్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న మొత్తం 32 మంది భారతీయులలో 15 మంది మరణించగా, మిగిలిన వారిని సురక్షితంగా కాపాడారు. సమాచారం ప్రకారం, ఒక ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ వ్యాపార భాగస్వాములకు ఏర్పాటు చేసిన టూర్ కోసం వీరంతా వియత్నాం వెళ్లారు. నిన్న జరిగిన ఈ ప్రమాదం తర్వాత అక్కడ అత్యంత హృదయ విదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదం జరిగిన బోటుకు సంబంధించిన సిబ్బంది మొత్తం 21 మందిని సురక్షితంగా రక్షించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు తీవ్రంగా చేపట్టడమే కాకుండా, వారికి ఆక్సిజన్ వంటి అత్యవసర సేవలు కూడా అందించే ప్రయత్నాలు చేశారు. ఈ క్లిష్ట సమయంలో సహాయం కోసం భారత ఎంబసీ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. బాధితుల కుటుంబ సభ్యులు 84362817930 అనే నంబర్‌ను సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన ఏపీకి చెందిన మృతుల వివరాలు.. వియత్నాంలో జరిగిన ఈ పడవ ప్రమాదంలో మొత్తం 15 మంది మరణించినట్లు ఇండియన్
ఎంబసీ ధృవీకరించింది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నల్లపేట ఆదిశేషయ్య, రవితేజ (హిందూపురం), ముడియం శ్రీధర్, జల్లి జయలక్ష్మి మరణించారు. మిగిలిన వారు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఈ బోటు ప్రమాదం గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి, గాయపడిన వారికి అత్యవసర సహాయం అందించాలని అధికారులను కోరారు.
తమిళనాడు సీఎం విజయ్ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణించిన వారి మృతదేహాలను వీలైనంత త్వరగా వారి స్వరాష్ట్రాలకు తరలించడానికి భారత రాయబార కార్యాలయం అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ ప్రమాదంలో తమిళనాడు నుండి ఎక్కువ మంది బాధితులు ఉన్న నేపథ్యంలో, తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా స్పందిస్తూ, ప్రభుత్వ అధికారులను ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసుకొని బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.