
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఫిట్నెస్ ఎంతో కీలకం. ముఖ్యంగా పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవడం కోసం చాలామంది హీరోయిన్లు కఠినమైన వర్కౌట్స్, డైటింగ్ చేస్తుంటారు. కొందరు జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చి తమ ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తుంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. తాను ఎందుకు బరువు పెరిగానో తెలుసుకున్న తర్వాతే తన బరువు తగ్గించే ప్రయాణం మొదలైందని వెల్లడించింది. జిమ్ము గిమ్ము లేదు ఇంట్లో ఉండే బరువు తగ్గా అంటూ చెప్పుకొచ్చింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి విద్యా బాలన్. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేస్తూ నటిగా తన సత్తా చాటుకుంది.




