
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద, విలాసం, సౌకర్యం, అందం, కళలు, ప్రేమ, వైవాహిక జీవితం, ఆస్తులు, ఆర్థిక పురోగతికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, ఊహించని విధంగా డబ్బు రావడమే కాకుండా, సమాజంలో గౌరవం, పలుకుబడి, అధికారం కూడా పెరుగుతాయని నమ్మకం. ఆగస్టు 25న శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దానివల్ల 5 రాశులవారికి మేలు జరగనుంది. ఆ రాశులేవో చూద్దాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడే కాబట్టి, ఈ రాశివారికి శుక్రుడి సంచారం ఎప్పుడూ ప్రత్యేకమే. ధనలాభ స్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల డబ్బు రాక పెరుగుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి అందొచ్చు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, ఒప్పందాలు, లాభదాయకమైన భాగస్వామ్యాలు కుదరవచ్చు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి, ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు రావచ్చు. శుక్రుడి దయతో విలాసవంతమైన వస్తువులు, వాహనం లేదా ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మిథున రాశి వారికి శుక్రుడి అనుకూల ప్రభావం వల్ల వృత్తి, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం, మీడియా, కళలు, కమ్యూనికేషన్, బ్యూటీ, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాక్చాతుర్యం, తెలివితేటలను సరిగ్గా ఉపయోగిస్తే కొత్త పరిచయాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల మద్ధతు కూడా లభించవచ్చు. సింహ రాశి వారికి శుక్రుడి అనుకూల స్థితి వల్ల పదవి, కీర్తి, పలుకుబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న మార్పు అనుకూలంగా జరగవచ్చు. పై అధికారుల ప్రశంసలు, కొత్త బాధ్యతలు దక్కవచ్చు. వ్యాపారంలో ఉన్నవారు పెట్టుబడులను విస్తరించే అవకాశాలు పొందుతారు. జాతకంలో శుక్ర-సూర్య సంబంధం, దశమ భావం బలంగా ఉంటే అధికారం, సామాజిక హోదా కూడా పెరుగుతాయని జ్యోతిష్యం చెబుతోంది. తుల రాశికి కూడా శుక్రుడే అధిపతి కాబట్టి, ఈ రాశివారికి శుక్రుడి అనుగ్రహం ఎక్కువగా