వరంగల్ జిల్లా రాజకీయాలు హాట్ టాఫిక్‌గా మారాయి. ఇటీవల పరకాల నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మరోసారి గెలిపించాలంటూ ప్రజల్ని కోరారు. ఆ పిలుపుపై మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయని.. రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు అప్పుడే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. పరకాలలో పోటీ చేయబోయేది తానేనని.. కొండా కుటుంబ సభ్యుల గెలుపును ఎవరూ అడ్డుకోలేరంటా హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా రేవూరి ప్రకాష్ రెడ్డి గెలవడని అన్నారు. తాజాగా కొండా సుస్మిత కామెంట్లకువర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కనీసం సభ్యత్వం లేని వారు మాట్లాడే మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు."గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కామెంట్ చేసిన వారికి సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. వారికి కనీసం కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదు. తెలుగులో ఓ సామెత ఉంది పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని. అమ్మాయి చిన్నా పెద్దా అని తేడా లేకుండా మాట్లాడుతుంది. ఆమెను వెనుక ఎవరున్నారో తెలుసు. డైపర్లు ఎవరు వేసుకుంటున్నారో తెలుసు. ఆమెకు ఎలాంటి అర్హత లేదు. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారిని అలా అనటం సరైంది కాదు. రేవంత్ రెడ్డి కాలి గోటికి ఆమె సమానం కాదు.' అని కేఆర్ నాగరాజు కౌంటర్ కామెంట్స్ చేశారు.తనపై కొండా సుస్మిత చేసిన కామెంట్లపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. కొండా సుస్మిత విమర్శలకు సమయం వచ్చినప్పుడు సరైన జవాబు ఇస్తానని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ముందు ముందు చాలా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తారని అందులో భాగంగానే ఆయన అలా అన్నారన్నారు. వ్యక్తిగత