
Vande Bharat Moulali Incident 20 Years Old Nurse Died Accidentally Falling Under Vande Bharat Train 326227
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Vande Bharat Moulali Incident: తల్లిదండ్రులతో కలిసి సాగిన ఆ సంతోషకరమైన ప్రయాణం క్షణాల వ్యవధిలోనే తీరని విషాదంగా మారింది. గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే జరిగిన అనూహ్య ప్రమాదం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ సమీపంలోని మౌలాలిలో చోటుచేసుకున్న ఈ రైలు దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగింది? తెలంగాణలోని జనగాంకు చెందిన 20 ఏళ్ల మానేపల్లి మానస వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 16న) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి మౌలాలి చేరుకున్నారు. మౌలాలి రైల్వే ఎల్సీ గేట్ నంబర్-6 సమీపంలోని అప్‌లైన్ వద్ద రైలు దిగిన మానస.. ప్లాట్‌ఫామ్ మారేందుకు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
అదే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు అతివేగంగా వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆమెను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మానస తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే కుమార్తె విగతజీవిగా పడిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతం.
రైల్వే పోలీసుల దర్యాప్తు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన మానస రైలు పట్టాలు దాటడానికి కారణం ఏమిటి? వందేభారత్ వస్తున్న విషయాన్ని ఆమె గమనించలేదా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు క్రైమ్ నంబర్ 418/2026 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు భావిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారి ప్రాణాలు కాపాడే నర్సు వృత్తిలో ఉన్న మానస, ఇలా రైలు ప్రమాదంలో దుర్మరణం చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.






