© 2026 nimisham.in

Vaibhav Sooryavanshi Schooled by Gautam Gambhir: భారత క్రికెట్ జట్టులో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్ పర్యటన చేదు జ్ఞాపకంగా మిగిలిపోతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమవడంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్లోనే వైభవ్‌కు గంభీర్ సుదీర్ఘంగా క్లాస్ పీకడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఐర్లాండ్ సిరీస్ నుంచి టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్‌లోనూ అదే నిరాశాజనక ప్రదర్శన పునరావృతమైంది. మరీ ముఖ్యంగా నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడటాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన, వారి దృక్పథంపై గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు క్రీడా వర్గాల సమాచారం. ఇది కూడా చదవండి: ఆ చెత్త ప్లేయర్.. ఇలాగే ఛాన్స్‌లిస్తే జింబాబ్వేపైనా మీరు గెలవలేరు గంభీర్..! క్రీడా జర్నలిస్ట్ అంకన్ కర్ అందించిన నివేదికల ప్రకారం.. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్‌లతో గంభీర్ సుదీర్ఘంగా చర్చించారు. భారత జట్టు వరుస వైఫల్యాలపై గంభీర్ చాలా ఆగ్రహంగా కనిపించారు. శ్రేయస్ అయ్యర్ ప్రెజెంటేషన్ కోసం వెళ్ళిన వెంటనే, గంభీర్ దృష్టి యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వైపు మళ్లింది. డగౌట్ లోనే దాదాపు 15 నిమిషాల పాటు వైభవ్‌తో గంభీర్ చాలా సీరియస్‌గా మాట్లాడారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ల చేతిలో వరుసగా వికెట్లు పారేసుకోవడంపై గంభీర్ హావభావాలు ఆయన అసంతృప్తిని స్పష్టం చేశాయి. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన వండర్ కిడ్.. — Indian Cricket 🏏 (@navshar54008403) July 10, 2026 రాజస్థాన్ రాయల్స్ తరపున మెరిసి, భారత జట్టులోకి అరంగేట్రం చేసిన
Vaibhav Sooryavanshi Schooled by Gautam Gambhir: భారత క్రికెట్ జట్టులో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్ పర్యటన చేదు జ్ఞాపకంగా మిగిలిపోతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమవడంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్లోనే వైభవ్‌కు గంభీర్ సుదీర్ఘంగా క్లాస్ పీకడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఐర్లాండ్ సిరీస్ నుంచి టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్‌లోనూ అదే నిరాశాజనక ప్రదర్శన పునరావృతమైంది. మరీ ముఖ్యంగా నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడటాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన, వారి దృక్పథంపై గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు క్రీడా వర్గాల సమాచారం.
ఇది కూడా చదవండి: ఆ చెత్త ప్లేయర్.. ఇలాగే ఛాన్స్‌లిస్తే జింబాబ్వేపైనా మీరు గెలవలేరు గంభీర్..!
క్రీడా జర్నలిస్ట్ అంకన్ కర్ అందించిన నివేదికల ప్రకారం.. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్‌లతో గంభీర్ సుదీర్ఘంగా చర్చించారు. భారత జట్టు వరుస వైఫల్యాలపై గంభీర్ చాలా ఆగ్రహంగా కనిపించారు. శ్రేయస్ అయ్యర్ ప్రెజెంటేషన్ కోసం వెళ్ళిన వెంటనే, గంభీర్ దృష్టి యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వైపు మళ్లింది.
డగౌట్ లోనే దాదాపు 15 నిమిషాల పాటు వైభవ్‌తో గంభీర్ చాలా సీరియస్‌గా మాట్లాడారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ల చేతిలో వరుసగా వికెట్లు పారేసుకోవడంపై గంభీర్ హావభావాలు ఆయన అసంతృప్తిని స్పష్టం చేశాయి.
ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన వండర్ కిడ్..
After losing the match, a very animated conversation is taking place between Gautam Gambhir, Sitanshu Kotak, and Shreyas Iyer.
- Gautam Gambhir is talking to Vaibhav Sooryavanshi in front of everyone in the field for 10-15 minutes and is looking very angry.
— Indian Cricket 🏏 (@navshar54008403) July 10, 2026 రాజస్థాన్ రాయల్స్ తరపున మెరిసి, భారత జట్టులోకి అరంగేట్రం చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లిష్ పేసర్ల స్వింగ్‌ను ఎదుర్కోవడంలో వైభవ్ పూర్తిగా తడబడ్డాడు. ఒక మ్యాచ్ లో విల్ జాక్స్ బౌలింగ్ లో అవుట్ కాగా, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ లో అతని సహచరుడైన జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లోనే వికెట్ సమర్పించుకున్నాడు. ఈ వరుస వైఫల్యాలు వైభవ్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: వద్దని చెప్పినా అంటగట్టేశారు.. అతని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..
కేవలం వైభవ్ మాత్రమే కాదు, మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ మినహా భారత టాప్ ఆర్డర్ మొత్తం ఈ సిరీస్‌లో ఘోరంగా విఫలమైంది. దూకుడుగా ఆడే అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవర్‌ప్లేలో బాధ్యతారహితంగా వికెట్లు పారేసుకోవడంపై గంభీర్ తీవ్రంగా మండిపడుతున్నారు. క్రమశిక్షణ లేని ఇలాంటి షాట్లను గంభీర్ అస్సలు సహించరనే సంకేతాలు ఈ చర్చతో స్పష్టమయ్యాయి.
సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఐదో టీ20 మ్యాచ్ వైభవ్‌కు అత్యంత కీలకం కానుంది. అక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, వైభవ్ క్రీజులో కుదురుకుంటే భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే జులై 14 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆలోపే జట్టులోని లోపాలను సరిదిద్దాలని గంభీర్ భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..