కి ఇచ్చే ఎండింగ్ లు మధ్య మధ్యలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం డీసెంట్ గానే ఉన్నాయి.
ఇలా ఏడవ ఎపిసోడ్ ఎండింగ్ వరకు మధ్యలో ప్లాన్ చేసుకున్న కథనం, పాత్రలు, వాటి డెవలప్మెంట్ అలా కొనసాగుతున్న కొద్దీ లోతు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. ఇక నటీనటుల్లో శశి కుమార్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా బాగా చేశారు. తనతో పాటుగా అనఘా కూడా మంచి పెర్ఫామెన్స్ కనబరిచారు.
వారితో పాటుగా యువ నటీనటులు మాత్రం బాగా చేశారు. యశ్వంత్, రేవతి శర్మలు ప్రేమికులుగా మంచి కెమిస్ట్రీ చూపించారు. అలాగే అపర్ణ దాస్ కూడా తన రోల్ లో బాగా చేసింది. ఇతర నటీనటులు కూడా బాగానే చేశారు.
ఖచ్చితంగా వదంది సీజన్ 1 రేంజ్ ఆశలు దీనిపై పెట్టుకుంటే మాత్రం వారికి ఈ సీజన్ నిరాశనే మిగులుస్తుంది. మెయిన్ గా ఆరంభంలో కొన్ని ఎపిసోడ్స్ అందులో పరిస్థితులు ప్లాన్ చేసుకోవడం బాగానే అనిపిస్తుంది కానీ ఈ క్రమంలో పెట్టిన సాగదీత మాత్రం చూసే ఆడియెన్ సహనాన్ని పరీక్షించక మానదు.
దీనితో ఈ 8 ఎపిసోడ్స్ ఉన్న సీజన్ చాలా భారంగా వెళుతున్నట్టు ఫీల్ కలుగుతుంది. ఎంత ఒక్కసారే మొత్తం చూసేద్దామన్నా చివరికి వచ్చేసరికి కథనంలో ఇచ్చే సిల్లీ ట్విస్ట్ లు చూసి మొదట నడిపించిన కథనాన్ని అంతటినీ తేలిపోయేలా చేస్తాయి. ఒక సీరియస్ టోన్ లో మొదలైన ఈ సీజన్ నెమ్మదిగా పేలవంగా మారిపోతుంది.
ముందు అంతా స్లోగా నడిపించినప్పటికీ అక్కడక్కడా ట్విస్ట్ లు ఇన్వెస్టిగేషన్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ అప్పుడు వరకు చేసిన ఆ ఇన్వెస్టిగేషన్ అంతటినీ సింపుల్ గా ఒక ‘హ్యూమన్ ఎర్రర్’ తేల్చి పారేయడం అన్ని వర్గాల ఆడియెన్స్ కి రుచించకపోవచ్చు. అలానే సిరీస్ ని ఒక రొటీన్ ఎండింగ్ తో ముగించేయడం మరో మైనస్ గా ఇందులో కనిపిస్తుంది.
ఇలా చివరి రెండు ఎపిసోడ్స్ ముందు ఓకే అనిపించే రేంజ్ లో ఉన్నాయి అనుకునే వాటిపై కూడా ఉన్న ఇంప్రెషన్ ని పోగొట్టేలా చేస్తాయి. అలానే ఇందులో మతపరమైన అంశాలను కూడా ఇరికించినట్టుగా అనిపిస్తుంది. వీటితో పాటుగా ఆ లవ్ ట్రాక్ లను కూడా తగ్గించి మరింత గ్రిప్పింగ్ గా సిరీస్ ని మలచి ఉంటే మరికొంత బెటర్ ఫీల్స్ ని కలిగించి ఉండొచ్చు.
ఈ సీజన్ లో కూడా సెటప్ అంతా నీట్ గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం బాగానే ఉంది. కెమెరా వర్క్ కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల వి ఎఫ్ ఎక్స్ సీన్స్ వీక్ గా ఉన్నాయి. ఎడిటింగ్ మాత్రం ఇంకా బెటర్ గా ఉండాల్సింది. పాటలు, లవ్ ట్రాక్ లు ఇంకా కొన్ని సీన్స్ ని తగ్గించి గ్రిప్పింగ్ గా మలచాల్సింది. తెలుగు డబ్బింగ్ బాగుంది.
ఇక దర్శకుడు ఆండ్రూ లూయిస్ విషయానికి వస్తే.. తన వర్క్ మొదటి కొన్ని ఎపిసోడ్స్ వరకు బాగానే క్లారిటీ గానే కనిపిస్తుంది కానీ చాలా సాగదీతగా ఎపిసోడ్స్ ని ప్లాన్ చేసుకున్నారు. అలాగే చివరి ఎపిసోడ్స్ లో మాత్రం సీరియస్ నెస్ మిస్సయ్యింది. దీనితో టోటల్ సీజన్ కే మిస్ ఫైర్ అయ్యినట్టు ముగుస్తుంది. సో తన వర్క్ మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేదు.
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘వదంది సీజన్ 2’ ఒక బోరింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది. మొదటి కొన్ని ఎపిసోడ్స్ లో కొంచెం ల్యాగ్ ఉన్నప్పటికీ డీటైలింగ్, కథనం పర్వాలేదు అనిపిస్తాయి. కానీ తర్వాత నుంచి కథనం పక్కదారి పడుతుంది. ముఖ్యంగా చివరి రెండు ఎపిసోడ్స్ లో ఆడియెన్స్ దృక్కోణాన్ని పూర్తిగా పక్కదారి పట్టించే విధంగా చేసిన ప్రయత్నం మిస్ ఫైర్ అయ్యింది. సో మీ టైం సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సీజన్ కి దూరంగా ఉంటేనే బెటర్.