PM Modi JD Vance Call : పశ్చిమాసియాలో క్రమంగా పెరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాల నేపథ్యంలో భారత్, అమెరికా అగ్రనాయకత్వాల మధ్య కీలకమైన దౌత్య సంభాషణ జరిగింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శుక్రవారం రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న 'సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత విస్తరించడం, విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా వాన్స్ దంపతులకు కుమారుడు జన్మించినందుకు ప్రధాని మోదీ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.టర్కీ, సౌదీ, పాకిస్థాన్‌ల ఒప్పందం వేళ..టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్‌లు ఇటీవల ఒక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసిన కొద్ది రోజులకే అమెరికా ఉపాధ్యక్షుడి నుంచి ప్రధాని మోదీకి ఈ ఫోన్ కాల్ రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. "అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాలలో మరింత లోతుగా ముందుకు తీసుకెళ్లే మార్గాలపై మేము చర్చించాం. ఇదే సమయంలో ఆయనకు, సెకండ్ లేడీ ఉషకు కుమారుడు జన్మించినందుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశాను" అని ప్రధాని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.అయితే ఈ సంభాషణకు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా అధికారికంగా ఇంకా విడుదల చేయలేదు.ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం గురించి ఈ భేటీలో చర్చకు వచ్చిందా లేదా అనే అంశంపై స్పష్టత రానప్పటికీ.. ఇటీవలి కాలంలో ఇరు దేశాల సంబంధాలు చాలా వరకు తగ్గినట్లుగా కనిపించాయి. ముఖ్యంగా గతేడాది వాషింగ్టన్ భారత్‌పై విధించిన శిక్షాత్మక సుంకాలు, అలాగే మే 2025లో భారత్-పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణలను తానే తగ్గించానని ట్రంప్ పదే పదే వ్యాఖ్యానించడం భారత్‌కు అసంతృప్తి కలిగించింది. ఆ ఘర్షణల విరమణ కేవలం భారత్, పాకిస్థాన్‌ల చర్చల