© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. US Iran Tensions: అమెరికా మరోసారి యుద్ధంలోకి దిగనుందా?. కాల్పుల విరమణ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారితో మేము ఎలాంటి చర్చలు జరపాలని కోరుకోవడం లేదని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న తరుణంలో అమెరికా పెద్దన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో శిఖరాగ్ర సమావేశంలో ఆయన నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందా అని ఒక విలేఖరి ప్రశ్నించగా, అది ముగిసిపోయిందని ఆయన సమాధానమిచ్చారు. ఇరానీయులతో వ్యవహరించడం లేదని, వారు నీచమైన, రోగుల మనస్తత్వం కలిగిన హింసాత్మక వ్యక్తులని ఆయన విమర్శించారు. వైమానిక దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈరోజు ఉదయం భారత కాలమానం ప్రకారం తెలిపింది. వాణిజ్య నౌకలపై జరిగిన దాడికి ప్రతిస్పందనగానే ఈ దాడులు ప్రారంభించామని, దురాక్రమణ ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు కూడా సంభవించినట్లు సమాచారం. రెండు నౌకలపై ఇరాన్ దాడి... హార్మూజ్ జలసంధిలో వెళ్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. యెమెన్ సమీపంలో కార్గోతో వెళ్తున్న నౌకకు భారీ నష్టం వాటిల్లింది. అమెరికా మద్దతు ఉన్న హార్మూజ్ దక్షిణ కారిడార్‌లో వెళ్తుండటంతో మిస్సైల్ అటాక్ జరిగిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. తాము ఆమోదించిన మార్గాన్ని పాటించని ఏ నౌక అయినా ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సిందేనని ఐఆర్జీసీ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నౌకలపై దాడుల నేపథ్యంలో అమెరికా ప్రతీకార చర్యలకు దిగుతోంది. మరోవైపు, యుఎస్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. బహ్రెయిన్‌లోని అమెరికాకు చెందిన
షేక్ ఈసా బేస్ పై డ్రోన్ అటాక్ చేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా కువైట్‌లోని మిలిటరీ స్థావరాలను కూడా టార్గెట్ చేశామని హెచ్చరించింది. హార్మూజ్ జలసంధిని మూసివేయాలని కూడా ఐఆర్జీసీ నేవీని ఆదేశించినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు.
లైసెన్సు రద్దు చేసిన యూఎస్... హార్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులు జరుగుతున్నందున, ఇరాన్ ఆయిల్ పై అమెరికా మరికొన్ని ఆంక్షలు విధించింది. చమురు విక్రయాల కోసం గతంలో ఇచ్చిన 60 రోజుల తాత్కాలిక మినహాయింపులను ఉపసంహరించుకుంది. ఆగస్టు 21 వరకు ఇచ్చిన లైసెన్స్‌ను అమెరికా రద్దు చేసింది. జలసంధిలో ఇరాన్ చర్యలు ఆమోదయోగ్యం కాదని, వీటికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
ఈ నెల మొదటి వారంలోనే ఇరాన్ యుద్ధం ముగిసిందని, అన్ని షరతులకు అంగీకరించిందని ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనికంగా ఓడిపోయిందని, వారి వద్ద కొద్దిపాటి శక్తే మిగిలిందని, దానిని కూడా తుడిచిపెట్టగలమని ప్రకటించారు. దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన పరోక్ష చర్చలు ముగిసిన వేళ ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు. అయితే ఈ చర్చల్లో శాశ్వత శాంతి కనిపించలేదు. ఈ నెల ప్రారంభంలో పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు సానుకూలంగా ముగిశాయని ఇరాన్ ప్రకటించింది. జప్తు చేసిన ఆస్తులలో కొంత విడుదలకు అంగీకరించిందని కూడా తెలిపింది. వివాదాన్ని పరిష్కరించడానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలిసింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా మళ్లీ యుద్ధం మొదలైంది.
ఖమేనీ అంత్యక్రియల వేళ... మరోవైపు, జూలై 9వ తేదీన ఖమేని అంత్యక్రియలు జరగనున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీమ్ లీడర్ భౌతిక కాయాన్ని ఇరాన్‌కు తరలిస్తున్నారు. ఈరోజు కర్బలాలో ఏర్పాట్లు చేసి, రేపు మషహాద్‌లో కమేని అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనిలో ఇరాక్ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. కమేని అంత్యక్రియల కోసం వేలాది మంది జనం రోడ్లపైకి రావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశ్చర్యపోయారు.
80 లక్ష్యాలను ఛేదించిన యూఎస్... జలసంధిలో ఇరాన్ దాడికి ప్రతీకారంగా అమెరికా సైన్యం కొత్త దాడులకు దిగింది. కచ్చితంగా 80కి పైగా లక్ష్యాలను ఛేదించామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ముఖ్యంగా కమాండ్ నెట్‌వర్క్‌లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, నౌక విధ్వంస క్షిపణి సామర్థ్యాలు, హార్మూజ్ జలసంధి సమీపంలోని 60కి పైగా పడవలను లక్ష్యంగా చేసుకున్నామని సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.