
హైదరాబాద్: రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల పేరిట పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. భూభారతి పోర్టల్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి దండుకోగా.. కాంగ్రెస్ హయాంలో అది లక్షలాది ఎకరాలకు చేరిందని విమర్శించారు. హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘రాత్రికి రాత్రే ప్రైవేటు భూములను 22ఏ జాబితాలో పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తున్న భూములను నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారు? ప్రజల వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం సీఎం ఇంటిని నిషేధిత జాబితాలో చేర్చారా? ధరణి స్థానంలో వచ్చిన భూభారతి నవ్వులపాలైంది. బీఆర్ఎస్ 10శాతం కమీషన్ తీసుకుంటే.. కాంగ్రెస్ 30 శాతం తీసుకుంటోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఓపెన్ భూములను అమ్మాలని చూస్తున్నారు. ప్రైవేటు భూముల్లో 50శాతం కమీషన్ అడుగుతున్నారు. ప్రభుత్వ భూముల్ని ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలి. రియల్ ఎస్టేట్ కంపెనీలను బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక ఈ భూములపై మళ్లీ పరిశీలన చేస్తాం. ఎమ్మెల్యేకు ఇష్టంలేకపోతే ఆ భూమి 22ఏలోకి వెళ్లిపోతుంది. ఈ భూముల విషయంలో భాజపా లీగల్ సెల్ ప్రజలకు సహాయం అందిస్తోంది. ప్రాముఖ్యతను బట్టి ముఖ్యమంత్రికి విదేశీ పర్యటనలకు అనుమతులు ఇస్తారు. విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడూ ఉన్నాయి’’ అని కిషన్ రెడ్డి అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల