... బీఆర్ఎస్ డ్రామాలాడిందన్నారు. పీఎంఏవై ఇండ్లు ఇస్తే మేమే ఇచ్చామని గప్పాలు కొడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని ఎదురుదాడి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది తెలంగాణ జనాభా 3.5 కోట్లుంటే... 3 కోట్ల 43 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇస్తారా? అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో 30 లక్షల మంది ఇన్ కం ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు కదా అంటూ విమర్శలు గుప్పించారు.
22ఏ నిషేధిత జాబితా పేరుతో మహాదోపిడీ కొనసాగుతోందన్నారు. ఏనుగులు మింగేటోడు పోయి పీనుగలు మింగేటోడు వచ్చాడని విమర్శించారు. తెలంగాణలో మొత్తం 2 కోట్ల 77 లక్షల ఎకరాలుంటే ఏకంగా 95 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెడతారా ..?.. ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అమ్మిన భూములను, హెచ్ ఎండీఏ వేలం వేసిన భూములను, ప్రజలు కష్టపడి డబ్బులు చెల్లించి కొనుక్కున్న భూములను, పరిశ్రమలకు అమ్మిన భూములను కూడా 22ఏలో పెడతారా?..అంటూ ఏకీపారేశారు.
ఆ జాబితా నుండి మా భూములను తొలగించాలంటూ ఏళ్ల తరబడి చెప్పులరిగేలా రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా రెండున్నరేళ్లుగా ఎందుకు పట్టించుకోవడం లేదని ఏకీపారేశారు. ఫీజుల బకాయిలే ఇయ్యలేదని... వచ్చే ఏడాది నుండి అడ్వాన్స్ గా జమ చేస్తామంటే నమ్మేదెలా? అని పంచ్ లు వేశారు. కోర్టు మొట్టికాయలు వేసినా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వాన్స్ గా రీయంబర్స్ మెంట్ పైసలు ఇస్తామంటే నమ్మేదెవరన్నారు.
కాంగ్రెస్ కు చిత్తు శుద్ధి ఉంటే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలన్నీ చెల్లించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభయ హస్తం తెలంగాణ ప్రజల పాలిటి భస్మాసుర హస్తమైందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు తేడా ఏముందని విమర్శలు గుప్పించారు. ఒక్క ఆసరా పెన్షన్ కూడా ఇయ్యలేఅని, నిరుద్యోగ భృతి ఇయ్యలేరన్నారు. పేదోడికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇయ్యలేరని, ఆరోగ్య శ్రీ ఇయ్యలే, ఫీజు రీయంబర్స్ మెంట్ ఇయ్యలేరని విమర్శించారు.
కేసీఆర్ 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల అప్పు చేస్తే.. రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో 3 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేయడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారితే... 6 గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి కాంగ్రెస్ కూడా హామీల పేరుతో మోసాలను కంటిన్యూ చేస్తోందన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ఒక కుటుంబమే దోచుకుంటే...... కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంతోపాటు ఢిల్లీ పెద్దలకు కూడా దోచి పెడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
హామీలిచ్చినప్పుడు డబ్బులు లేవని తెలియవా? డైవర్షన్ రాజకీయాలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలకు ఆ మాత్రం తెలియకుండానే అడ్డగోలు హామీలిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. 21 ఏళ్లకే యువత చట్ట సభలకు వచ్చేలా తీర్మానం చేస్తామంటే కాదనే వారెవరన్నారు. కాంగ్రెస్ కు చిత్త శుద్ధి ఉంటే జెన్ జీకి మంత్రి పదవులు, ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలన్నారు.
జెన్ జీలారా... కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ నేతల మాటల వెనుక ఉన్న అంతరార్ధాన్ని గుర్తించి నిలదీయాలన్నారు. అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్న బీజేపీకి తెలంగాణలో అవకాశమివ్వాలన్నారు.
Read more: KTR: రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా.!. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ మాస్ కౌంటర్.. ఏమన్నారంటే..?
12 ఏళ్లలో తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత మోదీదేనని పేర్కొన్నారు. హైవేస్, ట్రిపుల్ ఆర్ కోసమే రూ.1.74 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం మరో రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి మరింత సాధ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.