© 2026 nimisham.in

World Map Change : ప్రపంచ పటంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వందల ఏళ్లుగా ప్రాచుర్యంలో ఉన్న ప్రఖ్యాత మెర్కేటర్ ప్రపంచ పటానికి బదులుగా.. భూమి ఉపరితలాన్ని మరింత కచ్చితంగా చూపించే ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌ను ఆవిష్కరిస్తూ ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. ఈ కొత్త పటంలో ఆఫ్రికా పరిమాణం పెద్దగా కనిపిస్తుండగా.. యూరప్, ఉత్తర అమెరికా సైజు చిన్నగా అయింది. ఐక్యరాజ్యసమితి చేసిన ఈ తీర్మానానికి.. 164 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా మాత్రమే దీనికి వ్యతిరేకించగా.. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

Also Read : Canara Bank ATM Rules : ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. ఈ బ్యాంకు ATMలో లిమిట్ దాటితే ఛార్జీల మోతే!

ఖండాల అసలు విస్తీర్ణానికి అనుగుణంగా రూపొందించిన ఈ కొత్త ప్రపంచ పటాన్నే వినియోగించాలని సభ్య దేశాలను ఐక్యరాజ్య సమితి కోరింది. మారిటైం నేవిగేషన్ కోసం 1569లో గెరార్డస్ మెర్కేటర్ అనే కార్టోగ్రాఫర్.. ప్రపంచ పటాన్ని గీశారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అప్పట్లో భూభాగాల ఆకృతులు, కోణాలను కచ్చితత్వంతో చూపించడంపైనే దృష్టిపెట్టి ఈ మ్యాప్‌ను రూపొందించారు. ఖండాల పరిమాణాలు మాత్రం అందులో కచ్చితంగా లేవనే వాదన ఉంది.

భూమి గోళాకారంగా ఉండగా.. దాన్ని చదునైన కాగితంపై చూపించాల్సి రావడంతో.. మ్యాప్‌లో భూభాగాల పరిమాణాల్లో కొన్ని వక్రీకరణలు ఏర్పడతాయి. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు.. వాస్తవ పరిమాణం కంటే చాలా పెద్దగా కనిపిస్తాయి. యూరప్, ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్లాంటి ప్రాంతాలు భారీగా కనిపించగా.. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికాలాంటి ఖండాలు తక్కువ పరిమాణంలో కనిపిస్తాయి. మెర్కేటర్ మ్యాప్‌లో గ్రీన్లాండ్ దాదాపు ఆఫ్రికా అంత పెద్దదిగా కనిపిస్తుంది.

నిజానికి గ్రీన్లాండ్ కంటే ఆఫ్రికా విస్తీర్ణం దాదాపు 14 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ వక్రీకరణతో.. ఆఫ్రికా ఖండం వనరులు, జనాభా, ఆర్థిక సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలు వాస్తవ పరిమాణంలో ప్రపంచానికి కనిపించడం లేదనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు 2018లో కార్టోగ్రాఫర్ల బృందం ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్‌ను రూపొందించింది. ఈ మ్యాప్‌లో ఖండాల భూభాగ విస్తీర్ణాన్ని మరింత సముచిత నిష్పత్తిలో చూపించే ప్రయత్నం చేశారు.
కొత్త ప్రొజెక్షన్లో ఆఫ్రికాతోపాటు లాటిన్ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియాలాంటి ప్రాంతాలు కూడా మెర్కేటర్ మ్యాప్‌తో పోలిస్తే మరింత పెద్దగా కనిపిస్తాయి. భూమి గోళంపై కనిపించే ఆకారాలు, భూభాగాల సాపేక్ష విస్తీర్ణాన్ని సాధ్యమైనంత దగ్గరగా ప్రతిబింబించడమే దీని లక్ష్యం. ఈ తీర్మానాన్నే ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. దీన్ని టోగో ప్రతిపాదించింది. ప్రపంచాన్ని జనాలు ఎలా అర్థం చేసుకుంటారనే విషయంలో మ్యాప్స్ కీలక పాత్ర పోషిస్తాయని ఆ దేశం అంటోంది. ఇక ఈ తీర్మానానికి ఫ్రాన్స్ కూడా మద్దతు తెలిపింది. మెర్కేటర్ ప్రొజెక్షన్‌ను యూజ్ చేయమని ప్రకటించింది. అయితే, అమెరికా మాత్రం ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
ఐక్యరాజ్యసమితి నిజమైన అంతర్జాతీయ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో.. 16వ శతాబ్దానికి చెందిన మ్యాప్ ప్రొజెక్షన్లపై చర్చించడం సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తోందని అమెరికా ప్రతినిధులు విమర్శించారు. అయితే, ఈ తీర్మానం చట్టబద్ధంగా తప్పనిసరి కాకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు ఉపయోగించే మ్యాప్‌లలో మార్పులకు రూట్ క్లియర్ చేస్తుంది.
కొత్త ప్రపంచ పటానికి భారత్ మద్దతు పలికింది. కచ్చితత్వంతో కూడిన భూగోళ పటాన్ని రూపొందించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పింది. భౌగోళిక సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మ్యాప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని.. అందుకే ఈక్వల్ మ్యాప్ ఏరియా ప్రొజెక్షన్స్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఐతే మ్యాప్‌లో మార్పుల కోసం.. ఆఫ్రికన్ యూనియన్ కీలకంగా పనిచేసింది.
మార్చిలో ఏయూ ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌ను స్వీకరించింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో టోగో తరఫున UN సభ్య దేశాలను కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని కోరారు. తర్వాత UNలో తీర్మానం ముసాయిదా రూపొందించి.. జూలైలో దీనిపై అనధికారిక చర్చలు