
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీ ప్రీమియర్ లీగ్‌లో (DPL 2026) అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బ్యాటర్ కొట్టిన బంతి నేరుగా అంపైర్ ముఖానికి తాకింది. దీంతో ఆయన అక్కడే కింద పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మెరుగ్గా మారేందుకు అంపైర్‌ను ఐసీయూలో చేర్చినట్లు కథనాలు వస్తున్నాయి. డీపీఎల్‌లో ఈస్ట్ దిల్లీ రైడర్స్ - న్యూదిల్లీ టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ రైడర్స్ 20 ఓవర్లలో 192/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టైగర్స్ 156 రన్స్‌కే ఆలౌటైంది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌ను ఆశిశ్ మీనా వేశాడు. బ్యాటర్ లక్ష్య ధారేజా స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టగా.. అంపైర్ ధర్మేశ్ భరద్వాజ్‌కు నేరుగా తాకింది. బాధతో విలవిలాడిపోయారు. మరోవైపు ఏమవుతుందోనని లక్ష్య కంగారుపడిపోయాడు. వెంటనే ధర్మేశ్‌ను మైదానం నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆయనకు ఎలా ఉందని క్రికెట్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ఇండియా తిరుగులేని స్థితిలో నిలిచింది