
పీహెచ్డీ ప్రవేశాలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ-నెట్’ పరీక్షల్లో భారీగా తప్పులు బయటపడ్డాయి. మూడు సబ్జెక్టుల పరీక్షలు ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీలలో... చాలా ప్రశ్నల్లో తప్పులు, గతంలోని ప్రశ్నలు పునరావృతమైనట్టు గుర్తించామన్న ఎన్టీఏ.. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలు రద్దు వాటిని తిరిగి సెప్టెంబరు 9, 10 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడి జూన్లో 87 సబ్జెక్టుల్లో పరీక్ష పెట్టిన ఎన్టీఏ.. 84 సబ్జెక్టుల ‘కీ’ల విడుదల వీటి ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే ప్రకటిస్తామని వివరణ న్యూఢిల్లీ, ఆగస్టు 16: పీహెచ్డీ ప్రవేశాలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ-నెట్’ పరీక్షల్లో భారీగా తప్పులు బయటపడ్డాయి. మూడు సబ్జెక్టుల పరీక్షలు ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీలలో సరిదిద్దలేని స్థాయిలో తప్పులు ఉన్నట్టు గుర్తించామని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఆదివారం ప్రకటించింది. అంతేకాకుండా ఈ సబ్జెక్టుల్లో గత పరీక్షల్లో వచ్చిన చాలా ప్రశ్నలు ఆప్షన్లతో సహా యథాతథంగా వచ్చినట్టు తేలిందని వెల్లడించింది. కేవలం ప్రశ్నలను తొలగించడం, ఆప్షన్ల మార్పులకు అనుగుణంగా మార్కులు కేటాయించడం వంటి వాటికి అవకాశం లేనిస్థాయిలో లోపాలు ఉండటంతో.. మూడు సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపింది. సెప్టెంబరు 9న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంగ్లిష్ పరీక్ష, అదే రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కామర్స్ పరీక్ష, 10వ తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సోషియాలజీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. విద్యార్థులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరమేదీ ఉండదని తెలిపింది. ఎన్టీఏ జూన్లో మొత్తం 87 సబ్జెక్టులకు యూజీసీ-నెట్ పరీక్షలు నిర్వహించింది. పరీక్షల అనంతరం ప్రశ్నల్లో తప్పులు, పునరావృతాలు ఉన్నట్టుగా ఎన్టీఏకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీనితో ఎన్టీఏ ఒక ప్రత్యేక కమిటీని నియమించి పరిశీలన జరిపింది. ఈ క్రమంలో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ