
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో అసెంబ్లీ (Assembly) సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు టీవీకే ఎమ్మెల్యే ఆర్.పల్లవి (TVK MLA Pallavi) తన పసిబిడ్డతో హాజరవుతున్నారు. చిన్నారిని సహాయకురాలి సంరక్షణలో వదిలి సభా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం ఎమ్మెల్యే తీరును విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు సహా అన్ని ప్రదేశాలకు ఆమె తన బిడ్డను తీసుకువెళ్తూ హడావిడి సృష్టిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై ఎమ్మెల్యే పల్లవి స్పందిస్తూ.. చిన్నారి ఇంకా నెలల బిడ్డే కావడంతో తనను ఇంట్లో వదిలి రాలేకపోతున్నానని అన్నారు. వృత్తి ధర్మాన్ని, తల్లి బాధ్యతను నిర్వర్తించడంలో తప్పేముందని ప్రశ్నించారు. తన పని తాను చేసుకుంటున్నానని.. ఎలాంటి హడావిడి సృష్టించాలనే ఆలోచన లేదని పేర్కొన్నారు. ఇతరుల బాధలు అర్థం చేసుకోకుండా ట్రోల్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇదీ చదవండి: సీఎం విజయ్ రోజుకు 20 గంటలు పనిచేస్తారు: ఆధవ అర్జున గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రాణాలకు తెగించి కాపాడింది